మలయాళ నటుడు మమ్ముట్టి (mammootty), తమిళ నటి జ్యోతిక (jyothika)ప్రధాన పాత్రలలో నటించిన కొత్త సినిమా కాథల్ ది కోర్ (kathal the core) స్వలింగ సంపర్కుల (home sexual )పట్ల సమాజం ఏ విధంగా ప్రవర్తిస్తుంది? వారిని ఏ రకంగా చూస్తుంది? అన్న అంశాలను స్పృశిస్తూ తీసిన సినిమా ఇది! దర్శకుడు జియో బేబీ అద్భుతంగా తెరకెక్కించిన ఈ సినిమాలో మమ్ముట్టి నటన మహాద్భుతంగా ఉందని విమర్శకులు అంటున్నారు. నవంబర్ 23వ తేదీన విడుదలైన ఈ సినిమా హిట్ టాక్‌ను సంపాదించుకుంది.
మలయాళ నటుడు మమ్ముట్టి (mammootty), తమిళ నటి జ్యోతిక (jyothika)ప్రధాన పాత్రలలో నటించిన కొత్త సినిమా కాథల్ ది కోర్ (kathal the core) స్వలింగ సంపర్కుల (homosexual)పట్ల సమాజం ఏ విధంగా ప్రవర్తిస్తుంది? వారిని ఏ రకంగా చూస్తుంది? అన్న అంశాలను స్పృశిస్తూ తీసిన సినిమా ఇది! దర్శకుడు జియో బేబీ అద్భుతంగా తెరకెక్కించిన ఈ సినిమాలో మమ్ముట్టి నటన మహాద్భుతంగా ఉందని విమర్శకులు అంటున్నారు. నవంబర్ 23వ తేదీన విడుదలైన ఈ సినిమా హిట్ టాక్‌ను సంపాదించుకుంది. లేటెస్ట్‌గా ఈ సినిమాపై స్టార్ హీరోయిన్ సమంత ప్రశంసల వర్షం కురిపించారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన సమంత 'కాథల్ ది కోర్ సినిమా అద్భుతంగా ఉంది. ఈ ఏడాదిలో నేను చూసిన అత్యుత్తమ చిత్రం ఇదే. అందరూ చూడాల్సిన ఓ పవర్‌ఫుల్ సినిమా ఇది. మమ్ముట్టి సర్.. మీరు నా హీరో.. ఇందులో మీ నటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ సినిమా ఫీల్ నుంచి ఇంకా బయటకు రాలేకపోతున్నాను. మంచి సినిమా చూసినప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంద. లవ్యూ జ్యోతిక. జియో బేబి మీరు దిగ్గజం' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు సమంత. స్థూలంగా కథేమిటంటే రిటైర్ ఉద్యోగి (Retired employee) జార్జ్ (George) (మమ్ముట్టి), తన భార్య ఓమన (జ్యోతిక)తో కలిసి నివసిస్తుంటాడు. పంచాయతీ ఎన్నికల్లో (Panchayat elections) పోటీ చేయాలని నామినేషన్ వేస్తాడు. ఇది జరిగిన రెండు రోజులకు భర్త నుంచి విడాకులు (Divorce) కోరుతో ఓమన న్యాయస్థానాన్ని (Court) ఆశ్రయిస్తుంది. అదే ఊళ్లో డ్రైవింగ్ స్కూల్ (Driving School)నడుపుతున్న ఓ వ్యక్తితో జార్జ్ స్వలింగ సంపర్క బంధం కొనసాగిస్తున్నాడన్నది ఓమన ఆరోపణ. అయితే జార్జ్ లైంగికధోరణిని తాను నేరంగా చూడటం లేదని, కేవలం విడాకులు మాత్రమే తాను కోరుకుంటున్నానని అంటుంది. అయితే ఓమన ఆరోపణలను జార్జ్ ఖండిస్తాడు. తర్వాత ఏం జరిగిందన్నదే స్టోరి (Story). జార్జ్ ఎన్నికల్లో పోటీ చేస్తాడా? ఓమనకు విడాకులు వస్తాయా? ఓమన ఆరోపణల్లో నిజం ఉందా? సినిమా చూస్తే కానీ తెలియదు. ఈ సినిమా స్వలింగ సంపర్కాన్ని ప్రోత్సహించేలా ఉందని కువైట్ (kuwait), ఖతార్ (qatar) దేశాలు ఈ సినిమాను నిషేధించిన విషయం తెలిసిందే!