న‌వీన్ పొలిశెట్టి(Naveen Polishetty) , అనుష్కా షెట్టి(Anushka Shetty) హీరో హీరోయిన్లుగా వచ్చిన మిస్‌ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి(Miss Shetty, Mr. Polishetty) సినిమా పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతున్నది. సెప్టెంబర్‌ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విడుదలైన అన్ని కేంద్రాలలో మంచి టాక్‌తో స్క్రీనింగ్‌ అవుతోంది.

న‌వీన్ పొలిశెట్టి(Naveen Polishetty) , అనుష్కా షెట్టి(Anushka Shetty) హీరో హీరోయిన్లుగా వచ్చిన మిస్‌ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి(Miss Shetty, Mr. Polishetty) సినిమా పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతున్నది. సెప్టెంబర్‌ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విడుదలైన అన్ని కేంద్రాలలో మంచి టాక్‌తో స్క్రీనింగ్‌ అవుతోంది. నిర్మాతలకు డబ్బులు తెచ్చి పెడుతోంది. ఇప్పటికే ఈ సినిమాను మెగాస్టార్‌ చిరంజీవి, రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌తో పాటు చాలా మంది సెలబ్రిటీలు మెచ్చుకున్నారు. లెటెస్ట్‌గా సమంత(Samantha) కూడా ఈ సినిమాపై తన స్పందన తెలియచేశారు. తాను చాలా కాలంగా నవ్వడం లేదని, ఇప్పుడు సూపర్‌గా నవ్వించిన రత్నంలాంటి నవీన్‌ పొలిశెట్టికి ధన్యవాదాలు అని సమంత చెప్పారు. ఛామింగ్‌ అనుష్కతో పాటు చిత్ర యూనిట్‌ సభ్యులందరికీ శుభాకాంక్షలు అంటూ విషెస్‌ చెప్పింది సమంత.

సూపర్ ఫన్‌ రైడ్‌గా మంచి వసూళ్లు రాబడుతుండటంతో ఆ విజయాన్ని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు నవీన్ పొలిశెట్టి. మిస్‌ శెట్టి మిస్టర్ పొలిశెట్టికి బ్లాక్ బస్టర్ టాక్‌ అందించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఇప్పటికే ఓ వీడియోను షేర్ చేశాడు నవీన్ పొలిశెట్టి. మహేశ్‌బాబు.పీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు చిరంజీవి తొలి ప్రేక్షకుడిగా సూపర్ రివ్యూ కూడా ఇచ్చారు. Miss శెట్టి మిస్టర్ Polishetty తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా విడుదలైంది. డిఫరెంట్‌ బ్యాక్‌గ్రౌండ్‌ నుంచి వచ్చి సోలో లైఫ్‌ లీడ్ చేసే మిస్టర్‌ పొలిశెట్టి, మిస్‌ పొలిశెట్టి మధ్య సాగిన ఫన్నీ ట్రాక్‌ను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

Updated On 12 Sep 2023 1:08 AM GMT
Ehatv

Ehatv

Next Story