రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ(Vijay Devarkonda), టాప్‌ హీరోయిన్‌ సమంత(samantha) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ఖుషి(Kushi). దీనికి శివ నిర్వాణ(Shiva Nirvana) దర్శకుడు. మైత్రీ మూవీస్‌(Mytri Movies) పతాకంపై నవీన్‌ యేర్నేని, రవిశంకర్‌ యలమంచలి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్రం నుంచి రెండో పాటను విడుదల చేసింది చిత్ర బృందం.

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ(Vijay Devarkonda), టాప్‌ హీరోయిన్‌ సమంత(samantha) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ఖుషి(Kushi). దీనికి శివ నిర్వాణ(Shiva Nirvana) దర్శకుడు. మైత్రీ మూవీస్‌(Mytri Movies) పతాకంపై నవీన్‌ యేర్నేని, రవిశంకర్‌ యలమంచలి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్రం నుంచి రెండో పాటను విడుదల చేసింది చిత్ర బృందం. నాతో రా.. నీలా రా.. ఆరాధ్య అంటూ విజయ్‌ దేవరకొండ ఆలపిస్తే, పదము నీ వైపిలా పరుగు నీదే కదా అని బదులిచ్చారు సమంత. వందల కొద్దీ పండులున్నా వెన్నెల మొత్తం నిండుగ ఉన్నా.. నువ్వే లేనిదేదీ వద్దు అంటూ విజయ్‌ పాటను కొనసాగించాడు. సిద్‌ శ్రీరామ్‌(Sid sriram) , చిన్మయి(chinmai) ఈ పాటను పాడారు. మొత్తంగా ఈ పాటలో విజయ్‌, సమంత కెమిస్ట్రీ అదిరిపోయింది.

ఇదే పాతను తమిళంలో మదన్‌ కార్కీ(Madhan Karki) రాశారు. తమిళంలో కూడా సిద్‌ శ్రీరామ్‌, చిన్మయిలే ఆలపించారు. హిందీలో జుబిన్‌ నాటియల్‌(Zubin Natial), పలక్‌ ముచ్చల్‌(Palkh Muchal), కన్నడంలో హరిచరణ్‌ శేషాద్రి, చిన్మయి, మలయాళంలో కేఎస్‌ హరిశంకర్‌, శ్వేతా మోహన్ ఆలపించారు. హిషామ్‌ అబ్దుల్‌ సంగీతాన్ని అందించారు. ఇప్పటికే విడుదలైన నా రోజా నువ్వే పాట సూపర్‌హిట్టయ్యింది. ఆరాధ్య పాట కూడా సోషల్‌ మీడియాను ఊపేస్తోంది. జయరాం, సచిన్‌ ఖేడ్కర్‌, మురళీశర్మ, లక్ష్మీ, అలీ, శరణ్య పొన్‌వణ్ణన్‌, రోహిణి తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్‌ 1న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేస్తామని సినీ వర్గాలు తెలిపాయి.

Updated On 13 July 2023 1:13 AM GMT
Ehatv

Ehatv

Next Story