సల్మాన్ ఖాన్ సినిమా కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సినిమా విడుదలై థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతుంది. ఈద్ సందర్బంగా విడుదలైన సల్మాన్ ఖాన్ సినిమా మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. కానీ సోమవారం సినిమా కలెక్షన్స్ భారీగా పడిపోయాయి.

Salman Khan’s film passes Monday test with flying colours
సల్మాన్ ఖాన్(Salman Khan) సినిమా కిసీ కా భాయ్ కిసీ కి జాన్(Kisi Ka Bhai Kisi Ki Jaan) సినిమా విడుదలై థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతుంది. ఈద్ సందర్బంగా విడుదలైన సల్మాన్ ఖాన్ సినిమా మంచి ఓపెనింగ్స్(Openings) రాబట్టింది. కానీ సోమవారం సినిమా కలెక్షన్స్(Collections) భారీగా పడిపోయాయి. సల్మాన్ ఖాన్ చాలా కాలం తర్వాత కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సినిమాతో తెరపై కనిపించాడు. సినిమాను భారీగా ప్రమోట్(Promotions) చేసిన సల్మాన్.. హిట్ కొట్టేందుకు శాయశక్తులా ప్రయత్నించాడు. ఈ సినిమా సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్ బ్యానర్‌లో ఈ మూవీ తెరకెక్కింది. ఈ చిత్రంలో పూజా హెగ్డే(Pooja Hegde) హీరోయిన్(Heroin)గా నటించగా.. వెంకటేశ్(Venkatesh), జగపతి బాబు(Jagapathibabu), భాగ్యశ్రీ(Bhagyasri), భూమికా చావ్లా(Bhoomika Chawla), మాళవికా శర్మ(Malavika Sharma) కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలోని ఏంటామ్మా పాటలోసల్మాన్‌ఖాన్, వెంకటేష్ లతో కలిసి రామ్‌చరణ్(Ram Charan) స్టెప్పులు వేసి ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేశారు.
ఈద్(Eid)కి ఒకరోజు ముందు ఏప్రిల్ 21న విడుదలైన కిసీ కా భాయ్ కిసీ కి జాన్.. తొలి రోజు రూ.15.81 కోట్లు రాబట్టింది. శనివారం రూ.25.75 కోట్లు కలెక్షన్స్ సాధించింది. ఆదివారం అత్యధికంగా రూ.26.61 కోట్లు రాబట్టింది. దీంతో తొలి మూడు రోజులలో కిసీ కి భాయ్ కిసీ కి జాన్ కలెక్షన్లు రూ.68.17 కోట్లకు చేరుకున్నాయి.
వీకెండ్ కలెక్షన్ల(Weekend Collections) తర్వాత ట్రేడ్ విశ్లేషకుల(Trade Analysts) కళ్లు సోమవారం కలెక్షన్లపైన పడ్డాయి. సోమవారం కలెక్షన్లు సినిమా వైఫల్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపించింది. అయితే ట్రేడ్ వర్గాలు మాత్రం సల్మాన్ సినిమా ఫోర్త్ డే టెస్ట్ పాసయ్యింది అంటున్నారు. దేశవ్యాప్తంగా ఈ సినిమా నాలుగోరోజు రూ. 9.25 కోట్ల నుండి రూ.10 కోట్ల మధ్య వసూలు చేసింది. దీంతో కిసీ కి భాయ్ కిసీ కి జాన్ నాలుగు రోజుల్లో 77 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. వారాంతపు కలెక్షన్లతో పోల్చిచూస్తే వసూళ్లు భారీగా పడిపోయాయి. రూ.150 కోట్ల బడ్జెట్(Budget)తో తెరకెక్కిన ఈ సినిమా.. ఎంతవరకూ కలెక్ట్ చేస్తుందో చూడాలి మరి.
