సినీ ఇండస్ట్రీలో కొందరు ఏం చేసినా సెన్సేషనే. నిరంతరం వార్తల్లో ఉండాలని ప్రయత్నిస్తుంటారు. కొత్త కారు, కొత్త ఇల్లు, కొత్త వాచ్‌లు ఇలా ఏది కొనుక్కున్నా దాని గురించి వార్తలు రావాలని కోరుకుంటుంటారు. ఆ కోవలోకి బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్(Salamaan) వస్తారు. సినిమాల్లోనే కాకుండా ‘బిగ్‌బాస్’(Bigg Boss) ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు.
సినీ ఇండస్ట్రీలో కొందరు ఏం చేసినా సెన్సేషనే. నిరంతరం వార్తల్లో ఉండాలని ప్రయత్నిస్తుంటారు. కొత్త కారు, కొత్త ఇల్లు, కొత్త వాచ్‌లు ఇలా ఏది కొనుక్కున్నా దాని గురించి వార్తలు రావాలని కోరుకుంటుంటారు. ఆ కోవలోకి బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్(Salman) వస్తారు. సినిమాల్లోనే కాకుండా ‘బిగ్‌బాస్’(Bigg Boss) ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు. సల్మాన్‌ఖాన్ సినిమాలతో పాటు యాడ్స్, బిగ్‌బాస్ షో ద్వారా కూడా గట్టిగానే సంపాదిస్తున్నారు. 60 ఏళ్ల దగ్గర పడుతున్నా కానీ అటు ఫిట్‌నెస్, ఇటు గ్లామర్ తగ్గకుండా మెయింటెయిన్ చేస్తూ వస్తున్నారు. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్‌గా కూడా పాపులారిటీ తెచ్చుకున్నారు. ఫ్యాన్స్‌ను ఆకట్టుకునేందుకు రకరకాల ఫ్యాషన్‌ను ఫాలో అవుతుంటారు.
అయితే ఈ మధ్య సల్మాన్ ఖాన్ ధరించిన ఓ వాచ్ ధర చూస్తే మీరు షాక్ అవ్వాల్సిందే. ఖరీదైన వాచ్‌లను వాడే సల్మాన్‌ఖాన్ కొత్త వాచ్‌తో మెరిశారు. ఈ సారి అతని చేతికి పెట్టుకున్న వాచ్ ఖరీదు అక్షరాల ఇరవై మూడు కోట్లు (రూ.23 కోట్లు). పాటెక్ ఫిలిప్ రెయిన్‌బో(Patek Philippe Rainbow) కంపెనీకి చెందిన ఈ వాచ్‌లో 130 వజ్రాలను పొందుపర్చారట. ఈ వాచ్ చూసిన నెటిజన్లు ఇంత ఖరీదైన వాచా అని ముక్కున వేలేసుకుంటున్నారు. 'అందిరందన్నా'.. 'నువ్వు కింగ్' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.