పెళ్లీ అనే పదాన్ని తన డిక్షరీలోంచి తీసేసినట్టున్నాడు సల్మాన్ ఖాన్... 50 ఏళ్లు వచ్చినా పెళ్ళి చేసుకోలేదు. ఇక చేసుకుంటాడు అన్ననమ్మకం కూడా లేదు. కాని ఆయన డేటింగ్ ఖాతాలో ఉన్న హీరోయిన్ల లిస్ట్ మాత్రం చాలాపెద్దది మారి. లైఫ్ ను ఈరకంగా ఎంజాయ్ చేస్తూ.. పోతే, ఇంక పెళ్ళి మీదకు మనసు ఎందుకు వెళ్ళుంది మరి. ఈమధ్య కూడా సల్మాన్ ఖాన్ పెళ్ళిపై రకరకాల పుకార్లు వచ్చాయి. ఆకరికి పూజా హెగ్డేను కూడా పెళ్ళి చేసుకోబోతున్నాడు అని రూమర్ వచ్చింది. కాని అది రూమర్ గానే మిగిలింది.
బాలీవుడ్ లో మోస్ట్ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరో అంటే ముక్త కంఠంతో వినిపించే పేరు సల్మాన్ ఖాన్. కండల వీరుడు అమ్మాయిల కలల రాకుమారుడు అయిన సల్మాన్ కు పెళ్ళి వద్దంట కాని.. పిల్లల్ని మాత్రం కనాలని ఉందట. ఏంటీ వింత కోరిక.
పెళ్లీ అనే పదాన్ని తన డిక్షరీలోంచి తీసేసినట్టున్నాడు సల్మాన్ ఖాన్... 50 ఏళ్లు వచ్చినా పెళ్ళి చేసుకోలేదు. ఇక చేసుకుంటాడు అన్ననమ్మకం కూడా లేదు. కాని ఆయన డేటింగ్ ఖాతాలో ఉన్న హీరోయిన్ల లిస్ట్ మాత్రం చాలాపెద్దది మారి. లైఫ్ ను ఈరకంగా ఎంజాయ్ చేస్తూ.. పోతే, ఇంక పెళ్ళి మీదకు మనసు ఎందుకు వెళ్ళుంది మరి. ఈమధ్య కూడా సల్మాన్ ఖాన్ పెళ్ళిపై రకరకాల పుకార్లు వచ్చాయి. ఆకరికి పూజా హెగ్డేను కూడా పెళ్ళి చేసుకోబోతున్నాడు అని రూమర్ వచ్చింది. కాని అది రూమర్ గానే మిగిలింది.
ఇక తాజాగా సల్మాన్ ఖాన్ ఓ వింత కోరికను బయట పెట్టాడు. అదేంటంటే.. తాజాగా ఆప్ కీ అదాలత్ షోలో పాల్గొన్నాడు సల్మాన్. తనుకు ఎదురైన అన్ని ప్రశ్నలకు సూటిగా సమాధానం చెపుతూ పోతున్నాడు. ఇక పెళ్లీ.. పెళ్ళాం.. పిల్లల గురించి మాట్టాడుతూ.. తనకు పిల్లలు అంటే చాలా ఇష్టమని, కానీ ప్రస్తుతం ఉన్న భారతీయ చట్టాల ప్రకారం తాను తండ్రిని కాలేకపోతున్నట్లు వెల్లడించాడు. తల్లితండ్రుల పెళ్లి కోరికను తీర్చుతావా అని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. మ్యారేజీ గురించి తనకు ఇంకా క్లారిటీ లేదని, కానీ తండ్రి కావాలన్న కాంక్ష ఉన్నట్లు సల్మాన్ తెలిపాడు.
కర్ర విరగకుండా.. పాము చావకుండా.. సల్మాన్ ఖాన్ చెప్పిన సమాధానం ఎవరికి అర్ధం కాలేదు.. క్లారిటీ కూడా లేదు. సల్మాన్ ఖాన్ కు పెళ్లి ఉద్దేశ్యం మాత్రం లేదు అని తెలుస్తోంది. వారసుడినిమాత్రం కని తన తండ్రికి ఇవ్వాలని అనుకుంటున్నాడు. మరి కరణ్ జోహార్ లాగా సరోగసీని ఉపయోగించి పిల్లల్ని కంటాడా.. ? లేదా అగ్రిమెంటల్ మ్యారేజ్ చేసుకుని పిల్లల్ని కంటాడా అనేది చూడాలి.
అయితే ఈలోపు సల్మాన్ కొన్ని ఫన్నీ కామెంట్లు కూడా చేశాడు. పిల్లలంటే తనకు ఎంతో ఇష్టమని, కానీ పిల్లలు వస్తే, వాళ్లతో పాటే తల్లి కూడా వస్తుందని సల్మాన్ ఆ ఇంటర్వ్యూలో జోకేశాడు. పిల్లలకు తల్లే ముఖ్యమని, కానీ ఇంట్లో తల్లులు చాలా మంది ఉన్నారన్నారు. నాకు పుట్టే పిల్లల తల్లి.. నాకు భార్య అవుతుందని, రాబోయే నాలుగైదు ఏళ్లలో పిల్లల్ని కంటే, అప్పుడు రాబోయే 25 ఏళ్ల పాటు వారితో ఆడుకోవచ్చు అని సల్మాన్ కమెంట్ చేశాడు.