సల్మాన్ ఖాన్ కు ఇటీవల సినిమా సెట్‌లో పక్కటెముకకు

సల్మాన్ ఖాన్ తన సోదరి అర్పితా ఖాన్, బావ ఆయుష్ శర్మ తో కలిసి గణేష్ చతుర్థి వేడుకలను నిర్వహించారు. సల్మాన్ ఖాన్ తన మేనకోడలు అయత్‌తో కలిసి హారతి ఇస్తూ కనిపించారు. సలీం ఖాన్, అర్బాజ్ ఖాన్, సోహైల్ ఖాన్ కూడా వేడుకల్లో భాగమయ్యారు. వరుణ్ శర్మ, ఓర్రీ, ఇలియా వంతూర్ తదితరులు కూడా ఈ వేడుకలకు హాజరయ్యారు. వైరల్ వీడియోలో సల్మాన్ ఖాన్ మేనకోడలు అయత్‌తో కలిసి హారతి ఇస్తూ కనిపించాడు. ఆ తర్వాత మేనల్లుడు అహిల్‌ని, మరో పిల్లవాడిని తనతో కలిసి పూజకు రమ్మని పిలుస్తాడు.

తన కొత్త చిత్రం సికందర్ షూటింగ్‌లో సల్మాన్ ఖాన్ బిజీగా ఉన్నాడు. సల్మాన్ ఖాన్ కు ఇటీవల సినిమా సెట్‌లో పక్కటెముకకు గాయమైంది. సల్మాన్ ఖాన్ కూడా ఈ వార్తలను ధృవీకరించారు. బ్లాక్ సూట్ ధరించి కనిపించిన సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ 18 సెట్స్‌లో తన రెండు పక్కటెముకలు విరిగిపోయాయని తెలిపారు. తన కారు వైపు నడుస్తున్నప్పుడు తన రెండు పక్కటెముకలు విరిగాయని తన చుట్టూ ఉన్న వ్యక్తులను జాగ్రత్తగా ఉండమని సల్మాన్ కోరాడు.

సికందర్‌ సినిమాలో రష్మిక మందన్న, సునీల్ శెట్టి, సత్యరాజ్, ప్రతీక్ పాటిల్ బబ్బర్, చైతన్య చౌదరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఈద్‌కు విడుదల కానుంది. సల్మాన్ ఖాన్ చివరిసారిగా టైగర్ 3లో అవినాష్ సింగ్ రాథోడ్ పాత్రలో కనిపించాడు. ఈ చిత్రంలో కత్రినా కైఫ్, ఇమ్రాన్ హష్మీ కూడా కీలక పాత్రలు పోషించారు. సల్మాన్ ఖాన్ కు ప్రస్తుతం భారీ హిట్ అవసరం.


Sreedhar Rao

Sreedhar Rao

Next Story