ఒక దశాబ్దం తర్వాత, కిక్ కి డైరెక్ట్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. సల్మాన్ తన పాత్రను

బాలీవుడ్ స్టార్ హీరోలు దక్షిణాది దర్శకులకు అవకాశాలను ఇస్తున్నారు. గతేడాది దక్షిణాది దర్శకుడు అట్లీ డైరెక్షన్ లో వచ్చిన జవాన్ భారీ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మురుగదాస్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ నటించబోయే అవకాశం ఉందని ఫిలింనగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తూ ఉంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన రవితేజ కిక్ (2009) బాక్సాఫీస్ వద్ద ‘సూపర్ హిట్’గా నిలిచింది. సల్మాన్ ఖాన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రధాన పాత్రలతో హిందీలో రీమేక్ చేయగా.. ఇది బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.

ఒక దశాబ్దం తర్వాత, కిక్ కి డైరెక్ట్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. సల్మాన్ తన పాత్రను తిరిగి పోషించనున్నాడు. సాజిద్ నదియాద్వాలా ఈ ప్రాజెక్ట్‌కి నిర్మాతగా వ్యవహరిస్తూ ఉండగా ఏఆర్ మురుగదాస్ దర్శకుడుగా చేసే అవకాశం ఉందని అంటున్నారు. గజిని (2008), హాలిడే: ఎ సోల్జర్ ఈజ్ నెవర్ ఆఫ్ డ్యూటీ (2014), అఖిరా (2016) తర్వాత మురుగదాస్ చేస్తున్న నాలుగో సినిమా కిక్-2 హిందీ. ఈ చిత్రం యొక్క ప్రీ-ప్రొడక్షన్ వర్క్ ప్రారంభమైంది. ఈ సినిమా కిక్-2 (2015) యొక్క తెలుగు వెర్షన్‌కి రీమేక్ కాదు. మేకర్స్ కొత్త స్క్రిప్ట్ తో వస్తున్నారు. ఈద్ 2025కి గ్రాండ్ రిలీజ్‌ని టార్గెట్ గా పెట్టుకున్నారు. ప్రైమ్ వీడియో ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుంది.

Updated On 11 March 2024 4:23 AM GMT
Yagnik

Yagnik

Next Story