బాలీవుడ్ లో రొమాంటిక్ హీరోగా పేరుంది సల్మాన్ కు. ఆయన ఖాతాలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు. అంతే వివాదాలు కూడా ఆయన సొంత. ఇప్పటికీ ఆయన వివాదాల వల్ల సెక్యూరిటీని పెట్టుకుని తిరిగే పరిస్థతి వచ్చింది. అయినా ఆయన నుంచి వివాదాలు రావడం ఆగలేదు. సల్మాన్ ఖాన్(Salmaan Khan) చాలా జోవియల్ గా ఉంటారు. అందరితో ఇట్టే కలిసి పోతారు. చక్కగా నవ్వుతూ పలకరిస్తారు. అభిమానులతో మరింత ఫన్ గా ఉంటారు.
లేడీ జర్నలిస్ట్(Journalist) కు ఘాటుగా ముద్దు పెట్టాడు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. పబ్లిక్ గా ఆయన అలా చేసేవరకు అంతా షాక్ అయ్యారు. కాని అసలు విషయం తెలిసి హౌరా అంటున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే..?
బాలీవుడ్ లో రొమాంటిక్ హీరోగా పేరుంది సల్మాన్ కు. ఆయన ఖాతాలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు. అంతే వివాదాలు కూడా ఆయన సొంత. ఇప్పటికీ ఆయన వివాదాల వల్ల సెక్యూరిటీని పెట్టుకుని తిరిగే పరిస్థతి వచ్చింది. అయినా ఆయన నుంచి వివాదాలు రావడం ఆగలేదు. సల్మాన్ ఖాన్(Salmaan Khan) చాలా జోవియల్ గా ఉంటారు. అందరితో ఇట్టే కలిసి పోతారు. చక్కగా నవ్వుతూ పలకరిస్తారు. అభిమానులతో మరింత ఫన్ గా ఉంటారు.
తాజాగా ముంబైలో(Mumbai) ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(International Film Festival Of India) వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈవేడుకల్లో సల్మాన్ ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ లేడీ జర్నలిస్టును(Lady Journalist) ఆయన గట్టిగా దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. సడెన్ గా ఆయన చేసిన పనికి అంతా షాక్ అయ్యారు. ఇంత స్వతంత్రంగా ఆమెను ముద్దు ఎలా పెట్టుకున్నాడా అని అంతా షాక్ అయ్యారు. అయితే ఆతరువాత తెలిసింది ఆమె తన స్నేహితురాలు అని.
అక్కడ సీనియర్ రిపోర్టర్ గా ఉన్న తన స్నేహితురాలిని సల్మాన్ ఖాన్ చూశారు. వెంటనే ఆమెను ఆప్యాయంగా పలకరించారు. దగ్గరికి తీసుకుని ను దిటిపై ముద్దు పెట్టారు. ఆమె కూడా సల్మాన్ ను సరదాగా పలకరించింది. అంతె కాదు.. సల్మాన్ ఖాత్ దగ్గర ఉన్న చనువుతో అతన్ని.. డ్రామాలు చేయకు అంటూ అతడి బుగ్గలను నిమిరింది. ఆ తర్వాత సల్మాన్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో వీడియో సోషల్ వైరల్‌గా(Viral) మారింది.
ఈ విడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. సల్మాన్ ను మెచ్చుకుంటున్నారు. సల్మాన్ ఖాన్ టైగర్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీపావళి కానుకగా నవంబర్ 12న విడుదల అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటి వరకు రూ.376 కోట్లు వసూలు చేసింది.