ఈమధ్య అభిమానుల(Fans) అత్యుత్సాహం ఎక్కువైపోయింది. ఫ్యాన్స్ తమ స్టార్ హీరో మీద అభిమానంతో ఏం చేస్తున్నారు.. ఎంత అరాచకం చేస్తున్నారు అనేది తెలియకుండా చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) అభిమానులు అరాచకం చేశారు.

ఈమధ్య అభిమానుల(Fans) అత్యుత్సాహం ఎక్కువైపోయింది. ఫ్యాన్స్ తమ స్టార్ హీరో మీద అభిమానంతో ఏం చేస్తున్నారు.. ఎంత అరాచకం చేస్తున్నారు అనేది తెలియకుండా చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) అభిమానులు అరాచకం చేశారు.

బాలీవుడ్ కండ‌ల వీరుడు, సీనియర్ హీరో స‌ల్మాన్ ఖాన్ న‌టించిన సినిమా టైగ‌ర్ 3(Tiger 3). మనీష్ శర్మ(Manish Sharma) డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో క‌త్రినా కైఫ్(Katrina Kaif) హీరోయిన్ గా నటించింది. యశ్ రాజ్ ఫిల్మ్స్(Yashraj Films) బ్యానర్‌ పై ఆదిత్య చోప్రా(Aditya Chopra) ఈ సినిమాను నిర్మించారు. స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈసినిమా లో విలన్ గా ఇమ్రాన్ హష్మి(Imran hashmi) నటించి మెప్పించారు. ఇక ఈసినిమా దివాళి కానుకగా.. నవంబర్ 12న రిలీజ్ అయ్యింది. రిలీజ్ అవ్వడంతో పాటు.. మొదటిరోజే.. 44 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది మూవీ.

ఈమూవీకి ప్రీత‌మ్‌, త‌నూజ్ సంగీతాన్ని అందించగా..ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, త‌మిళం బాష‌ల్లో విడుద‌లై మొద‌టి రోజు మంచి వ‌సూళ్ల‌ను సాధించింది. దీపావ‌ళి పండుగ రోజునే స‌ల్మాన్ ఖాన్ సినిమా విడుద‌ల కావ‌డంతో అభిమానుల ఆనందం రెట్టింపైంది. థియేట‌ర్ల వ‌ద్ద ప్రేక్ష‌కుల కోలాహ‌లం క‌నిపించింది. అయితే.. ఓ థియేట‌ర్‌లో సినిమా స్క్రీనింగ్ అవుతుండ‌గా కొంద‌రు ప‌టాకులు(Crackers) కాల్చారు. ఈ అనూహ్య ఘ‌ట‌న‌తో భ‌యాందోళ‌న‌కు గురైన ప్రేక్ష‌కులు థియేట‌ర్ నుంచి బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు.

ఈ సంఘటన మ‌హారాష్ట్ర‌లోని(Maharastra) మాలెగావ్‌లోని ఓ థియేట‌ర్లో జ‌రిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ అయ్యింది. దాంతో నెట్టింట్లో ఎంతో మంది నెటిజన్లు స్పందిస్తున్నారు.. ఈ ఘ‌ట‌న‌పై నెటీజ‌న్లు మండిప‌డుతున్నారు.ఈ ప‌ని చేసిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న పోలీసుల దృష్టికి వెళ్లింది. దీనిపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను అదుపులోకి తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. దాదాపు ఒక నిమిషం పాటు థియేట‌ర్‌లో ట‌పాకుల మోత మోగింది. రాకెట్లు, సీమ‌ట‌పాకాయ‌ల‌ను పేల్చారు. నిప్పు ర‌వ్వులు త‌మ వైపు దూసుకురావ‌డంతో ప్రేక్ష‌కులు భ‌యాందోళ‌న‌కు గురై బ‌య‌ట‌కు ప‌రుగెత్తారు.

Updated On 13 Nov 2023 7:54 AM GMT
Ehatv

Ehatv

Next Story