బాలీవుడ్ హీరో.. సల్మాన్ ఖాన్(Salman Khan) ముంబయ్(Mumbai) లోని తన ఇంటిని రెంటుకు(rent) ఇచ్చాడట. కాస్ట్లీ ఏరియాలో ఉన్న అత్యంత విలాసవంతమైన ఇంటిని రెంటుకు ఇచ్చి లక్షల్లో వసూలు చేస్తున్నారంట.
బాలీవుడ్ హీరో.. సల్మాన్ ఖాన్(Salman Khan) ముంబయ్(Mumbai) లోని తన ఇంటిని రెంటుకు(rent) ఇచ్చాడట. కాస్ట్లీ ఏరియాలో ఉన్న అత్యంత విలాసవంతమైన ఇంటిని రెంటుకు ఇచ్చి లక్షల్లో వసూలు చేస్తున్నారంట.
సినిమా సెలబ్రిటీలు ప్రస్తుతం సినిమాలను మాత్రమే నమ్ముకోవడం లేదు.. ఇతర మార్గాల్లో కూడా చేతినిండా సంపాదిస్తున్నారు. బిజినెస్ లు చేస్తున్నారు, స్థిరాస్తులు కొంటున్నారు. హోటల్లు కడుతున్నారు.. ఒక్కటేమిటి.. ఎన్నో రకాలుగా సంపాదిస్తున్నారు. ఇక అలానే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్.. సంపాదించడానికి మరో మార్గాన్ని వెతుకున్నారు. తనకు ఉన్న ఇళ్లలో కొన్నింటిని అద్దెకు ఇచ్చి.. లక్షల్లో రెంటు వసూలు చేస్తున్నాడట.
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు సందించిన ఓన్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్ లో చేతినిండా సంపాదన ఉన్న హీరోలలో సల్మాన్ ఒకరు. అంతే కాదు ఇండియా అంతా ఉన్నసెలబ్రిటీలలో, అత్యంత సంపన్నులలో కూడా సల్మాన్ ఖాన్ ముందు వరసలోనే ఉంటారు. సల్మాన్ ఖాన్ లగ్జరీ లైఫ్, ఆయన ఫామ్ హౌస్, కార్లు, దాంతో పాటు సల్మాన్ సొంత సెక్యూరిటీకి కలిపి ఎంత ఖర్చు అవుతుందో తెలిసిందే. అయితే ప్రస్తుతం సల్మాన్ ఖాన్ విలాసవంతమైన గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లలో నివసిస్తున్నారు. అంతేకాకుండా ముంబైలో భారీగా ఆస్తులను కూడా కలిగి ఉన్నారు.
అయితే రీసెంట్ గా సల్మాన్ ఖాన్ తనకున్నఅపార్ట్మెంట్స్ లో ఒకదానిని రెంట్ కు ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. సల్మాన్ ఖాన్ ముంబైలోని శాంతాక్రజ్‌లో తన ప్రధాన వాణిజ్య ప్రాపర్టీలో ఒకదానిని అద్దెకు ఇస్తున్నారట. దానికి సంబంధించిన రెంట్ అగ్రిమెంట్ కూడా అయిపోయినట్టు తెలుస్తోంది. లాస్ట్ మన్త్ అంటే అగస్టు నుండి 60 నెలల టైమ్ డ్యూరేషన్ లో ఈ రెంటల్ అగ్రిమెంట్ ఉన్నట్టు తెలుస్తోంది.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్(Indian Express) నివేదిక ప్రకారం,భవనంలోని కింది అంతస్తు.. గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తు.. రెండవ అంతస్తులను సల్మాన్ కలిగి ఉన్నారు. నివేదికల ప్రకారం మొదటి సంవత్సరంలో ఈ భవనం నెల అద్దె రూ.90 లక్షలు. ఇక రెండవ సంవత్సరంలో రూ. 1 కోటికి చేరుకుంటుంది. తదుపరి సంవత్సరాల్లో ఈ మొత్తం రూ. 5 లక్షలకు పెరుగుతుందని అంచనా.మూడవ సంవత్సరం రూ. 1.05 కోట్లు, నాలుగు మరియు ఐదవ సంవత్సరానికి వరుసగా రూ. 1.10 కోట్లు, రూ. 1.15 కోట్లు. సల్మాన్ ఖాన్ ముంబైలోని బాంద్రా వెస్ట్‌లోని శివ్ అస్థాన్ హైట్స్‌లో నెలకు రూ. 95,000 చొప్పున మరో అపార్ట్‌మెంట్‌ను అద్దెకు ఇచ్చాడని సమాచారం.