తమిళ స్టార్ హీరో సూర్య(Surya) షూటింగ్ లో గాయపడ్డారు. ప్రస్తుతం తన 42వ ప్రాజెక్ట్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడుసూర్య. 'కంగువ'(Kanguva) టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈమూవీలో చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. షూటింగ్ అయిపోతుంది అనుకున్న సమయంలో సూర్య గాయపడటం(Injury) అంతా షాక్ వుతున్నారు. ఇక రీసెంట్ గా ఈ మూవీ థాయ్ లాండ్ లో షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చింది. ప్రస్తుతం చెన్నైలో షూటింగ్

ఈ సందర్భంగా చెన్నైలో భారీ యాక్షన్ సీన్స్(Action sequence) షూటింగ్ చేస్తుండగా.. సూర్యపై అనుకోకుండా రోప్ కెమెరా వచ్చి పడింది. అయితే అది వచ్చి సూర్య భుజంపై పడటంతో.. పెద్ద గాయం అయినట్టు తెలుస్తోంది. దీంతో షూటింగ్ ను ఆపేసిన యూనిట్ సభ్యులు సూర్యను వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి(Hospital) తరలించారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారని... ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే వుందని తెలుస్తోంది.

అయితే సూర్య పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ రోప్ కెమెరా సూర్య భుజానికి కాకుండా తలకు తగిలి ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని చెపుతున్నారు. సూర్య త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు ప్రార్థిస్తున్నారు. సూర్య గాయపడిన విషయాన్ని సూర్య పీఆర్ కూడా ధ్రువీకరించారు. షూటింగ్ లో సూర్య గాయపడిన విషయం నిజమేనని, అయితే అది అంత పెద్ద గాయం కాదనే సమాచారం నిర్మాతల నుంచి వచ్చిందని ఆయన తెలిపారు.

అయితే సూర్యను పరీక్షించిన వైద్యులు ఆయన పరిస్థితి బాగానే ఉందని, కొన్నాళ్లు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని చెప్పారని వెల్లడించారు. మరోవైపు ఈ సినిమాను జ్ఞానవేల్ రాజా తో కలిసి యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది. మరికొంత షూటింగ్ పెండింగ్ లో ఉండగా.. ఈషూటింగ్ సూర్య కోలుకున్న జరపబోతున్నట్టు తెలుస్తోంది.

Updated On 24 Nov 2023 11:20 PM GMT
Ehatv

Ehatv

Next Story