సినిమా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్(Prabhas Fans) అయితే ఈ రోజు కోసం చాన్నాళ్లుగా వెయిట్ చేస్తున్నారు. డార్లింగ్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న సలార్ టీజర్(Salaar Teaser) వచ్చేసింది. వారికి కనువిందు చేసింది. ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఇది. ప్రభాస్ మాస్ యాక్షన్ అవతార్ అయితే చూస్తున్న ప్రతి ఒక్కరిని మెస్మరైజ్ చేసింది.

Prabhas Salaar Teaser
సినిమా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్(Prabhas Fans) అయితే ఈ రోజు కోసం చాన్నాళ్లుగా వెయిట్ చేస్తున్నారు. డార్లింగ్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న సలార్ టీజర్(Salaar Teaser) వచ్చేసింది. వారికి కనువిందు చేసింది. ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఇది. ప్రభాస్ మాస్ యాక్షన్ అవతార్ అయితే చూస్తున్న ప్రతి ఒక్కరిని మెస్మరైజ్ చేసింది. సుమారు 106 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియో సినిమాపై అంచనాలను రెట్టింపు చేసేసింది. గురువారం తెల్లవారుజామున టీజర్‌ను రిలీజ్ చేశారు. 'సింహం, చిరుత, పులి, ఏనుగు.. చాలా ప్రమాదం. కానీ జురాసిక్ పార్క్‌లో కాదు.. ఎందుకంటే ఆ పార్కులో అంటూ టినూ ఆనంద్ డైలాగ్‌తో టీజర్ మొదలవుతుంది. ప్రభాస్ సినిమా నుంచి ఫ్యాన్స్ కోరుకునే అన్ని మాస్ అంశాలను మేళవించి సలార్‌ను తీర్చిదిద్దినట్టు టీజర్‌ను చూస్తే అర్థమవుతోంది. మిగతా క్యారెక్టర్స్‌ను పెద్దగా చూపించలేదు. ప్రభాస్ ముఖం మాత్రం చూపించకుండా పిడికిలి బిగించిన చేతిని మాత్రమే చూపించాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఫినిషింగ్‌లో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran)ను చూపిస్తూ టీజర్‌ను ముగించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 28న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్టు టీజర్‌లో తెలిపారు. సలార్‌లోశ్రుతిహాసన్(Shruti Haasan) హీరోయిన్‌గా చేస్తోంది. విలన్ రాజమన్నార్ పాత్రలో జగపతి బాబు(Jagapathi Babu), మరో విలన్‌గా మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించబోతున్నారు. తమిళ నటి శ్రియారెడ్డి(Sriya Reddy) కూడా కీలకపాత్ర పోషించింది. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్.. టీజర్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో గూస్ బంప్స్ తెప్పించాడు. ప్రశాంత్ నీల్ ఎప్పటిలానే మాస్ ఫార్ములాని నమ్ముకున్నాడు. టీజర్ చూస్తుంటే హోంబలే ఫిల్మ్స్ బడ్జెట్కి ఏ మాత్రం వెనకాడలేదని క్లియర్గా అర్థమవుతోంది. ఇదిలా ఉంటే టీజర్‌లో ప్రభాస్ కటౌట్ క్లియర్‌గా చూపించకపోవడంతో పాటుగా ఆయనకు ఎలాంటి డైలాగ్స్ లేకపోవడంతో ఫ్యాన్స్ నారాజ్‌గా ఉన్నారు. మరికొందరైతే ఇది టీజర్‌నా లేదా గ్లింప్స్ నా అంటూ కామెంట్లు చేస్తున్నారు. టీజర్‌తో సినిమాపై భారీ అంచనాలను పెంచేసినా ప్రభాస్ ఫేస్ చూపించకపోవడంతో వారు కొంత వరకు హర్ట్ అయినట్లు తెలుస్తోంది.
