రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన పాన్ ఇండియన్ బిగ్గెస్ట్ మూవీ సలార్‏(Salaar)పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కేజీఎఫ్2 తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న ప్రాజెక్టు కావడంతో ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమాను ఈ సంవత్సరం సెప్టెంబర్ 28న పెద్ద ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమా వాయిదా పడుతుందని సోషల్ మీడియాలో కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం విడుదల విషయంలో ఎలాంటి జాప్యం జరగదని చిత్ర బృందం స్పష్టం చేసింది. అలాగే ఈ సినిమా మీరు మరిచిపోలేని సినిమాటిక్ ఎక్స్‏పీరియన్స్‏ను అందిస్తుందని నిర్మాతలు హామీ ఇస్తున్నారు.

ఇక ఈ వార్త ప్రభాస్ అభిమానులందరికీ రిలీఫ్ కలిగించిందని చెప్పాలి. ఈ సంవత్సరం వెండి తెరపై తమ అభిమాన నటుడిని రెండుసార్లు చూడవచ్చంటున్నారు. ఈ చిత్రంలో శృతిహాసన్ (Shruti Haasan) హీరోయిన్‏గా నటిస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran), జగపతిబాబు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. హొంబాలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరంగదూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ ట్యూన్స్ కంపోజ్ చేస్తున్నారు.

Updated On 15 May 2023 1:20 AM GMT
Ehatv

Ehatv

Next Story