అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే ఈపాటికి సలార్‌(Salaar) రిలీజయ్యి ఉండేది. బాక్సాఫీసు లెక్కల గురించి ఫ్యాన్స్‌ మాట్లాడుకుంటూ ఉండేవాళ్లు. సోషల్‌ మీడియాలో ప్రభాస్‌(Prabhas) గురించి చర్చోపచర్చలు సాగుతుండేవి. థియేటర్లు కిటకిటలాడుతుండేవి. ఒక్కమాటలో చెప్పాలంటే సలార్‌ మోహంలో సినిమా అభిమానులు పడిపోయిఉండేవారు.

అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే ఈపాటికి సలార్‌(Salaar) రిలీజయ్యి ఉండేది. బాక్సాఫీసు లెక్కల గురించి ఫ్యాన్స్‌ మాట్లాడుకుంటూ ఉండేవాళ్లు. సోషల్‌ మీడియాలో ప్రభాస్‌(Prabhas) గురించి చర్చోపచర్చలు సాగుతుండేవి. థియేటర్లు కిటకిటలాడుతుండేవి. ఒక్కమాటలో చెప్పాలంటే సలార్‌ మోహంలో సినిమా అభిమానులు పడిపోయిఉండేవారు. మొదట అనుకున్న షెడ్యూల్ ప్రకారం సినిమా సెప్టెంబర్‌ 28న విడుదల కావాల్సి ఉండింది. రిలీజ్‌కు రెండు వారాల ముందు సినిమా పోస్ట్‌పోన్‌ అంటూ హోంబలే సంస్థ ప్రకటించి ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ను నిరాశపర్చింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులలో ఏర్పడిన జాప్యం కారణంగానే సినిమా విడుదలను వాయిదా వేస్తున్నామని చెప్పింది.

దీంతో నవంబర్‌లో సినిమా వస్తుందని కొందరు ఆశపడ్డారు. డిసెంబర్‌లో పక్కాగా రిలీజవుతుందని మరికొందరు చెప్పుకున్నారు. లేటెస్ట్‌గా మేకర్స్‌ రిలీజ్‌ డేట్‌పై అఫీషియల్‌ ప్రకటన ఇచ్చారు.
డిసెంబర్‌ 22న క్రిస్మస్‌ పండుగ(Cristmas ) సందర్భంగా విడుదల చేస్తున్నట్లు వారి నుంచి అధికారిక ప్రకటన వచ్చేసింది.వారం నుంచి సోషల్‌ మీడియాలో(Social media) వస్తున్న వదంతులు నిజమయ్యాయన్నమాట! రిలీజ్‌ డేట్‌ను అనౌన్స్‌ చేస్తూ ఓ పవర్‌ఫుల్‌ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. అందులో ప్రభాస్‌ మోస్ట్‌ వాయిలెంట్‌గా కనిపిస్తున్నారు.

చేతిలో పదునైన కత్తి పట్టుకుని ఒళ్లంతా రక్తంతో నిండిన ప్రభాస్‌ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. పోస్టర్‌ చూసిన ఫ్యాన్స్‌ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. డిసెంబర్‌ 22 నుంచి డైనోసార్‌ వేట మొదలవుతుందన్నమాట! అలాగే వచ్చే నెల నుంచి ఈ సినిమా ప్రమోషన్స్‌ కార్యక్రమాలు ప్రారంభించి నవంబర్‌లో ట్రైలర్‌ విడుదల చేసేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సలార్‌ టీజర్‌ కేవలం 24 గంటల్లోపే 83 మిలియన్ల వ్యూవ్స్‌ను సొంతం చేసుకుని రికార్డును సృష్టించింది.

యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన శ్రుతి హాసన్‌ నటిస్తున్నారు.ప్రధాన పాత్రలలో జగపతిబాబు, ఈశ్వరీరావు, శ్రియారెడ్డి నటిస్తున్నారు. ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్ సీజీ వర్క్‌తో పాటు క్లైమాక్స్‌కు సంబంధించి కొన్ని కీలక రిపేర్లు చేస్తున్నాడట.
ఇదిలాఉంటే సలార్‌ రిలీజ్‌ రోజునే షారూక్‌ ఖాన్‌ నటించిన డుంకీ సినిమా రిలీజ్‌ అవుతోంది. ఇప్పటికే పఠాన్‌, జవాన్‌ సినిమాల విజయాలతో జోరు మీదున్న షారుక్‌ఖాన్‌ డుంకీతో హ్యాట్రిక్ కొట్టాలని కసితో ఉన్నాడు. అదీ కాకుండా అదే రోజున ఆక్వామెన్ ఫాలెన్ కింగ్ డం కూడా రిలీజవుతుంది.

Updated On 29 Sep 2023 5:00 AM GMT
Ehatv

Ehatv

Next Story