డార్లింగ్‌ ప్రభాస్‌(Prabhas) నటించిన లేటెస్ట్‌ సినిమా సలార్‌(Salaar) దుమ్ము రేపుతోంది. ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో శుక్రవారం విడుదలైన ఈ సినిమా కలెక్షన్లను కుమ్మేస్తోంది. ఎక్కడ చూసినా సలార్‌ సందడే కనిపిస్తోంది. బాహుబలి తర్వాత అంతటి విజయాన్ని అందుకోవడంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ అయితే తెగ సంబరపడుతున్నారు. చాన్నాళ్ల తర్వాత వచ్చిన భారీ హిట్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ హౌస్‌ఫుల్‌ కలెక్షన్లతో రికార్డు క్రియేట్‌ చేస్తున్నది సలార్‌.

డార్లింగ్‌ ప్రభాస్‌(Prabhas) నటించిన లేటెస్ట్‌ సినిమా సలార్‌(Salaar) దుమ్ము రేపుతోంది. ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో శుక్రవారం విడుదలైన ఈ సినిమా కలెక్షన్లను కుమ్మేస్తోంది. ఎక్కడ చూసినా సలార్‌ సందడే కనిపిస్తోంది. బాహుబలి తర్వాత అంతటి విజయాన్ని అందుకోవడంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ అయితే తెగ సంబరపడుతున్నారు. చాన్నాళ్ల తర్వాత వచ్చిన భారీ హిట్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ హౌస్‌ఫుల్‌ కలెక్షన్లతో రికార్డు క్రియేట్‌ చేస్తున్నది సలార్‌. మొదటి రోజు కలెక్షన్లు 175 కోట్ల రూపాయలని సినీట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. అడ్వాన్స్‌ బుకింగ్‌ ద్వారానే 90 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. ఈ ఏడాదిలో మొదటి రోజు బిగ్గెస్ట్‌ ఓపెనింగ్స్‌ ఇచ్చిన సినిమా ఇదేనని సినీ ట్రెడ్‌ వర్గాలు అంటున్నాయి. తర్వాతి స్థానంలో దళపతి విజయ్‌(Vijay Thalapthy) నటించిన లియో, ప్రభాస్‌ నటించిన ఆదిపురుష్‌ ఉన్నాయి. ఈ రెండు సినిమాలు మొదటి రోజున 140 కోట్ల రూపాయల గ్రాస్‌తో అత్యధిక ఓపెనింగ్స్‌ను అందుకున్నాయి. ఇప్పటి వరకు ఇండియాలో మొదటి రోజు అత్యధిక ఓపెనింగ్స్‌ కలెక్షన్లను అందుకున్న సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌ మాత్రమే! ఈ సినిమాకు మొదటి రోజు 223 కోట్ల రూపాయల కలెక్షన్లు వ్చాయి. ఆ తర్వాత కేజీఎఫ్‌-2 సినిమా 165 కోట్ల రూపాయలతో సెకండ్‌ ప్లేస్‌లో ఉండింది. ఇప్పుడు సలార్‌ ఆ రికార్డును దాటేశాడు. తొలి రోజు బిగ్గెస్ట్ కలెక్షన్లు సాధించిన మొదటి రెండు సినిమాలు సౌత్‌ ఇండియావే కావడం విశేషం.

Updated On 23 Dec 2023 5:12 AM GMT
Ehatv

Ehatv

Next Story