డార్లింగ్‌ ప్రభాస్‌(Prabhas) హీరోగా వస్తున్న సినిమా సలార్‌-1(salaar-1). దీనికి కేజీఎఫ్‌ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌(Prashanth Neel) దర్శకత్వం వహిస్తున్నాడు. ఆదిపురుష్‌(Adipurush) సినిమా నిరాశపర్చడంతో అభిమానులు సలార్‌పై గంపెడాశలు పెట్టుకున్నారు.

డార్లింగ్‌ ప్రభాస్‌(Prabhas) హీరోగా వస్తున్న సినిమా సలార్‌-1(salaar-1). దీనికి కేజీఎఫ్‌ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌(Prashanth Neel) దర్శకత్వం వహిస్తున్నాడు. ఆదిపురుష్‌(Adipurush) సినిమా నిరాశపర్చడంతో అభిమానులు సలార్‌పై గంపెడాశలు పెట్టుకున్నారు. పైగా ప్రశాంత్‌ నీల్‌ డైరెక్టర్‌ కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల విడుదలైన టీజర్‌ యూ ట్యూబ్‌ను షేక్‌ చేస్తోంది. దేశ వ్యాప్తంగా అందరిని ఆకట్టుకుంది. విదేశాలలో కూడా సలార్‌ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా, ఆతృతగా ఎదురుచూస్తున్నారు. లేటెస్ట్‌గా ఈ సినిమా ఓవర్‌సీస్‌ విడుదల(Overseas Release) విషయంలో సరికొత్త రికార్డను నెలకొప్పింది.

ఉత్తర అమెరికాలో 1979కి పైగా కేంద్రాలలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఇక విదేశాలలో అయిదు వేలకు పైగా థియేటర్లలో ఈ సినిమా ప్రేక్షకులకు కనువిందు చేయనుంది. అమెరికాలో ఈ సినిమా ప్రీమియర్‌ షోలను సెప్టెంబర్‌ 27న ప్రదర్శించనున్నారు. ఉత్తర అమెరికాలో 1979కి పైగా కేంద్రాలలో విడుదల అవుతున్న తొలి భారతీయ సినిమాగా సలార్‌-1 సరికొత్త రికార్డును సృష్టించిందని ఈ సినిమా ఓవర్‌సీస్‌ రిలీజ్‌ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న సంస్థ సోషల్‌ మీడియాలో తెలిపింది. ఈ సినిమాలో శ్రుతిహాసన్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, జగపతిబాబు తదితరులు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాను హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై విజయ్‌ కిరంగదూర్‌ నిర్మిస్తున్నారు. సలార్‌-1 సెప్టెంబర్‌ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Updated On 19 July 2023 2:03 AM GMT
Ehatv

Ehatv

Next Story