యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌(Prabhas) నటించిన సలార్‌ సినిమా గ్రాండ్‌గా విడుదలయ్యింది. పెద్దగా ప్రమోషన్లు లేకుండానే రిలీజైన ఈ సినిమా థియేటర్లను షేక్‌ చేస్తున్నది. ఈ సినిమా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. అయితే ఇప్పటి వరకు ఊరించిన ఓ రికార్డు తృటిలో ప్రభాస్‌ చేజారింది. ఇప్పటి వరకు నైజాంలో బిగ్గెస్ట్‌ ఓపెనర్‌ ఆర్‌ఆర్‌ఆర్‌(RRR) సినిమానే! ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కలిసి నటించిన సినిమా కాబట్టి ఓపెనింగ్‌ భారీగా ఉండటం సహజం. ఈ సినిమాకు మొదటి రోజు 23.35 కోట్ల రూపాయల షేర్‌ వచ్చింది.

యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌(Prabhas) నటించిన సలార్‌ సినిమా గ్రాండ్‌గా విడుదలయ్యింది. పెద్దగా ప్రమోషన్లు లేకుండానే రిలీజైన ఈ సినిమా థియేటర్లను షేక్‌ చేస్తున్నది. ఈ సినిమా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. అయితే ఇప్పటి వరకు ఊరించిన ఓ రికార్డు తృటిలో ప్రభాస్‌ చేజారింది. ఇప్పటి వరకు నైజాంలో బిగ్గెస్ట్‌ ఓపెనర్‌ ఆర్‌ఆర్‌ఆర్‌(RRR) సినిమానే! ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కలిసి నటించిన సినిమా కాబట్టి ఓపెనింగ్‌ భారీగా ఉండటం సహజం. ఈ సినిమాకు మొదటి రోజు 23.35 కోట్ల రూపాయల షేర్‌ వచ్చింది. ఈ రికార్డను సలార్‌(Salaar) బ్రేక్‌ చేయలేకపోయింది. నైజాంలో మొదటి రోజు సలార్‌కు వచ్చింది 22.55 కోట్ల రూపాయల షేర్‌. సలార్‌ సినిమాకు నైజాంలో టికెట్‌ రేట్లు బాగానే పెంచారు. కొన్ని చోట్ల బెనిఫిట్‌ షోలను కూఆ వేశారు. ఇదంతా చూసి సలార్‌ మూవీ ట్రిపులార్‌ రికార్డను బ్రేక్‌ చేస్తుందని అనుకుననారు. కానీ సెకండ్‌ ప్లేస్‌లోనే నిలిచింది. ఇందుకు ప్రధాన కారణం షారూక్‌ఖాన్‌(Shahrukh Khan) నటించిన డంకీ సినిమా. నైజాలో ఆలా మల్టీప్లెక్సులను డంకీతో సలార్‌ షేర్‌ చేసుకోవలసి వచ్చింది. డంకీ ఇప్పుడు రిలీజ్‌ కాకపోయి ఉంటే సలార్‌కు మరిన్ని మల్టీప్లెక్స్‌లు(Multiplex) దొరికేవి. అప్పుడు ఆర్‌ఆర్ఆర్‌ రికార్డు ఈజీగా బ్రేక్‌ అయ్యేది. నార్త్‌లోనూ సలార్‌కు మంచి ఓపెనింగ్సే వచ్చాయి. ఎనిమిది నుంచి 10 కోట్ల రూపాయల మధ్య వసూళ్లు వస్తాయని ట్రేడ్‌ భావించింది కానీ ఏకంగా 15 కోట్ల రూపాయలను వసూలు చేసింది.

Updated On 23 Dec 2023 4:31 AM GMT
Ehatv

Ehatv

Next Story