ఎన్టీఆర్ 30 చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‏గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని ప్రస్తుతం ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్‏తో చిత్రీకరణ చేయనున్నారు. ఈ మూవీతోనే జాన్వీ కపూర్ టాలీవుడ్‏లోకి ఎంట్రీ ఇస్తోంది. అయితే ఇప్పుడు ఈ మూవీపై ఓ రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ చేస్తున్నట్టు గత కొన్ని రోజులుగా తెగ ప్రచారం జరుగుతోంది.

అయితే ఈ ఇష్యూపై ఎట్టకేలకు సైఫ్ అలీఖాన్ టీమ్ రియాక్ట్ అయింది. ఈ సినిమాలో బలమైన పాత్ర కోసం సైఫ్ బాగా సరిపోతాడని కొరటాల శివ కోరుకున్నాడని.. అంతా అనుకున్నట్టు జరిగితే త్వరలోనే అఫియల్ అనౌన్స్‏మెంట్ ఉంటుందని సైఫ్ అలీ ఖాన్ టీమ్ తెలిపింది. మరో వైపు ఈ చిత్ర ప్రొడ్యూసర్స్ కూడా స్పందిస్తూ.. ఇప్పుడే ఈ విషయంపై మేం ఏమీ కన్ఫామ్ చేయలేమని.. ఈ క్యారెక్టర్ కోసం విక్రమ్, విజయ్ సేతుపతి లాంటి వాళ్లను కూడా పరిశీలిస్తున్నామన్నారు.

ఆ పరిశీలనలో భాగంగానే సైఫ్ కనిపించారన్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం సిటీ ఔట్‏స్కర్ట్స్‏లో భారీ సెట్‏ను నిర్మించారు. షూటింగ్ త్వరలోనే ప్రారంభంకానుంది. ఇక చిత్రానికి 2023 మార్చి 23న ముహూర్తం పెట్టారట. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ సెకండ్ హీరోయిన్ గా చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పటికే రిలీజైన జాన్వీకపూర్ పోస్టర్‍ మంచి రెస్పాన్స్ అందుకుంది.

ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‏పై మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. మ్యూజిక్ అనిరుధ్ రవిచందర్ అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, ఎడిటర్‏గా శ్రీకర్ ప్రసాద్ ఉన్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సినిమాను తెలుగుతోపాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో భాషల్లో విడుదల చేయబోతోన్నారు.

Updated On 20 March 2023 3:30 AM GMT
Ehatv

Ehatv

Next Story