తనపై దాడి ఘటన గురించి పోలీసులకు బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ వాంగ్మూలం ఇచ్చినట్లు తెలిసింది.
తనపై దాడి ఘటన గురించి పోలీసులకు బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ వాంగ్మూలం ఇచ్చినట్లు తెలిసింది. సైఫ్ అలీఖాన్ ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయన నుంచి దాడికి సంబంధించిన విషయాలపై వివరాలు సేకరించారు. తనపై దుండగుడు ఎలా దాడి చేశాడో చెప్పినట్లు తెలిసింది. పోలీసులకు సైఫ్ ఇచ్చిన వాంగ్మూలంలో 'నేను,నా భార్య కరీనా కపూర్ ఖాన్ 11వ అంతస్తులో బెడ్ రూమ్‌లో ఉన్నాం. ఆ సమయంలో మా ఇంట్లో సహాయకురాలు ఎలియామా ఫిలిప్ అరుపులు, కేకలు పెట్టింది. దుండగుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ నా చిన్న కుమారుడు జహంగీర్ ( జెహ్) నిద్రిస్తున్న గదిలోకి చొరబడి. కత్తితో అగంతకుడు జెహ్‌ను బెదిరించాడు. కోటి రూపాయిలు ఇవ్వాలని ఫిలిప్‌ను డిమాండ్ చేశాడు. దీంతో జెహ్ ఏడ్వడం ప్రారంభించాడు.. దుండగుడి నుంచి జెహ్‌ను రక్షించేందుకు మా పనిమనిషి ఫిలిప్ ప్రయత్నించిందదని...దీంతో దుండగుడు ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఫిలిప్ అరుపులు విన్న నేను జెహ్ రూంకు వెళ్లి చూడగా.. ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ జరుగుతోందని.. జెహ్‌ను రక్షించేందుకు నేను కూడా దుండగుడిని అడ్డుకునే ప్రయత్నం చేశా.. అప్పుడే దుండగుడు నా వీపు భాగం,మెడ, చేతులపై పలుమార్లు కత్తితో పొడిచాడు. నా నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దుండగుడి నుంచి జెహ్‌ను రక్షించిన సహాయకులు మరో రూంలోకి తీసుకెళ్లారు’ అని పోలీసులకు సైఫ్ వాంగ్మూలం ఇచ్చారు.