✕
Sai Tamhankar : ఎల్లో కలర్ డ్రెస్సులో బ్యాక్ చూపిస్తోన్న సాయి.. యు ఆర్ హాట్ అంటున్న ఫ్యాన్స్.. !
By EhatvPublished on 20 May 2023 5:45 AM GMT

x
Sai Tamhankar latest stunning photoshoot in yellow dress
-
- మరాఠీ నటి సాయి తమ్హంకర్ (Sai Tamhankar) అప్పుడప్పుడు బికినీ ఫొటోలతో అందాలను ఆరబోస్తుంటుంది. ఈమె 2008లో శుభాష్ ఘాయ్ దర్శకత్వంలో వచ్చిన ‘బ్లాక్ అండ్ వైట్ ’ (Black & White) మూవీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అదే ఇయర్లో వచ్చిన మరో సినిమా ‘సనాయ్ చౌఘడే’ చిత్రంలో నటించి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణపొందింది ఈ బ్యూటీ.
-
- తాజాగా ఈ బ్యూటీ యెల్లోకలర్ (Yellow Color) డ్రెస్‌లో బ్యూటిఫుల్ లుక్స్‌తో సోషల్ మీడియాలోకి కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇప్పుడా ఫొటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. ఆమె గ్లామర్ లుక్ చూసి ఫ్యాన్స్ కామెంట్స్ సెక్షన్ బాక్సులోకి దూసుకొస్తున్నారు.లేటెస్ట్గా రిలీజ్ చేసిన ఫొటోలకు యూజర్లందరూ ఫుల్ పాజిటివ్‌గా కమెంట్స్ చేస్తున్నారు. ఈ ఫొటోలకు స్టెప్పింగ్ ఇన్‌టూ సెలబ్రేషన్స్ విత్ మై ఓన్ సన్షైన్అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.
-
- ఇక మరాఠీ భామ ఆమీర్ ఖాన్ నటించిన ‘గజినీ’ (Ghajini) చిత్రంలోనూ నటించింది. ఆ తర్వాత 2015లో ‘క్లాస్ మేట్స్’,‘హంటర్’, వజందర్, ఫ్యామిలీ కట్టర్ వంటి చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఈ హాట్ భామ 1986 మహారాష్ట్రలోని సంగ్లీలో జన్మించింది. సవార్కర్ ప్రతిస్థాన్ లో విద్యాభ్యాసం పూర్తి చేసింది సాయి తమ్హంకర్. ఈ భామ స్టేట్ లెవెల్ కబడ్డీ ప్లేయర్ తోపాటు కరాటేలో ఆరెంట్ బెల్ట్ సంపాదించింది.
-
- ఈమె హిందీ, మరాఠీ చిత్రాలతో పాటు తమిళం, మలయాళం సినిమాలు, టీవీ కార్యక్రమాల్లోనూ నటించి సౌత్ లోనూ తన ఫర్ఫామెన్స్ చూపించింది. ఈమె 2013 డిసెంబర్ 13న విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్టు ఎమె గోసవిని వివాహం చేసుకుని, రెండేళ్ల తర్వాత ఆయనకు విడాకులు ఇచ్చి ఆ తర్వాత 2022లో అనీష్ జోగ్ అనే అతన్ని రెండో పెళ్లి చేసుకుందీ ఈ అమ్మడు.
-
- ఈ భామ గతంలో ఆరెంజ్ కలర్ బికినీ షూట్ ఫోటోలతో అందరనీ అవాక్కయ్యేలా చేసింది సాయి తమ్హంకర్. సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తూ.. యువకులకు నిద్రలేకుండా చేస్తుంది సాయి. ఈ బ్యూటీకి పెట్స్ అంటే బాగా ఇష్టమట. ఇదిలా ఉంటే సాయి తమ్ హంకర్ బెస్ట్ యాక్టర్ అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు ఈ భామకు 3.4 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

Ehatv
Next Story