మరాఠీ నటి సాయి తమ్ హంకర్ అప్పుడప్పుడు బికినీ ఫొటోలతో దర్శనమిస్తుంటుంది. ఈమె 2008లో శుభాష్ ఘాయ్ దర్శకత్వంలో వచ్చిన ‘బ్లాక్ అండ్ వైట్ ’ మూవీతో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. అదే సంవత్సరంలో వచ్చిన మరో సినిమా ‘సనాయ్ చౌఘడే’ చిత్రంలో నటించి ప్రేక్షకుల ఆదరణపొందింది సాయి
ఇక ఆ తర్వాత ఆమీర్ ఖాన్ నటించిన ‘గజినీ’ చిత్రంలోనూ నటించింది. ఆ తర్వాత 2015లో ‘క్లాస్ మేట్స్’,‘హంటర్’, వజందర్, ఫ్యామిలీ కట్టర్ వంటి చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది ఈ భామ.
ఈ హాట్ భామ 1986 మహారాష్ట్రలోని సంగ్లీలో జన్మించింది. సవార్కర్ ప్రతిస్థాన్ లో విద్యాభ్యాసం పూర్తి చేసింది సాయి తమ్ హంకర్. ఈ భామ స్టేట్ లెవెల్ కబడ్డీ ప్లేయర్ తోపాటు కరాటేలో ఆరెంట్ బెల్ట్ సంపాదించింది.
ఈమె హిందీ, మరాఠి చిత్రాలతో పాటు తమిళం, మలయాళం సినిమాలు, టీవీ కార్యక్రమాల్లోనూ నటించి సౌత్ లోనూ తన ఫర్ఫామెన్స్ చూపించింది. అటు సినిమాలు చేస్తూనే ఇటు హాట్ హాట్ బికినీ ఫొటోలను ఆడియన్స్ మతులు పోగొడుతోంది ఈ మరాఠి భామ
ఈమె 2013 డిసెంబర్ 13న విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్టు ఎమె గోసవిని వివాహం చేసుకుని, రెండేళ్ల తర్వాత ఆయనకు విడాకులు ఇచ్చి ఆ తర్వాత 2022లో అనీష్ జోగ్ అనే అతన్ని రెండో పెళ్లి చేసుకుందీ ఈ ముద్దుగుమ్మ.
ఈ భామ గతంలో ఆరెంజ్ కలర్ బికినీ షూట్ ఫోటోలతో అందరనీ అవాక్కయ్యేలా చేసింది సాయి తమ్ హంకర్. సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తూ.. యువకులకు నిద్రలేకుండా చేస్తుంది సాయి.
ఈ బ్యూటీకి పెట్స్ అంటే బాగా ఇష్టమట. ఇదిలా ఉంటే సాయి తమ్ హంకర్ బెస్ట్ యాక్టర్ అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఇక తాజాగా నాబి అందాలను చూపిస్తూ ఓ ఫోటో షేర్ చేసింది. ఇప్పటికి ఈ భామకు 3.5 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.