ఒకానొక సమయంలో సాయిపల్లవి డాన్స్‌ను చూసి చాలా మంది సినిమా వాళ్లు ఆమె కాల్షీట్ల కోసం వచ్చారు. అలా కస్తూరి మాన్, ధామ్ ధూమ్(Dham Dhum) అనే తమిళ సినిమాల్లో నటించింది. అప్పుడు కూడా సాయి పల్లవి హీరోయిన్ కావాలన్న కోరిక, ఆశ లేవు. మలయాళ డైరెక్టర్ అల్ఫోన్స్ పుత్రన్ డైరెక్ట్ చేసిన ప్రేమమ్(Premam) సినిమా సాయి పల్లవి కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది
మిగతా ఆర్టిస్టులతో పోలిస్తే సాయి పల్లవి(Sai Pallavi) చాలా డిఫరెంట్. ఆమె వ్యక్తిత్వం చాలా గొప్పది. చాలా మంది డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను అని చెప్పుకుంటారు. ఈమె నిజంగానే డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యారు. జార్జియాలో(Georgia) ఈమె వైద్య విద్యను అభ్యసించారు. ఆరంభంలో అభిరుచి కోసం కొన్ని సినిమాల్లో నటించారు. తర్వాత నటననే కెరీర్‌గా మలచుకున్నారు. నటన కంటే డాక్టర్ వృత్తిలో స్థిరపడటమే తన కోరిక అంటుంటారు సాయి పల్లవి. వైద్య(Medicine) వృత్తిలో ఉంటూ పేదలకు సేవ చేయాలని ఉందని చాలా సందర్భాలలో చెప్పుకున్నారు. తమిళనాడుకు చెందిన సాయిపల్లవి బాగా పాపులరయ్యింది మాత్రం మలయాళ సినిమాల్లోనే. తల్లి దగ్గర సంప్రదాయ నృత్యాన్ని(Classical Dance) నేర్చుకున్న సాయిపల్లవి అద్భుతమై డాన్సర్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఒకానొక సమయంలో సాయిపల్లవి డాన్స్‌ను చూసి చాలా మంది సినిమా వాళ్లు ఆమె కాల్షీట్ల కోసం వచ్చారు. అలా కస్తూరి మాన్, ధామ్ ధూమ్(Dham Dhum) అనే తమిళ సినిమాల్లో నటించింది. అప్పుడు కూడా సాయి పల్లవి హీరోయిన్ కావాలన్న కోరిక, ఆశ లేవు. మలయాళ డైరెక్టర్ అల్ఫోన్స్ పుత్రన్ డైరెక్ట్ చేసిన ప్రేమమ్(Premam) సినిమా సాయి పల్లవి కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. ఆ సినిమాలో ముగ్గరు హీరోయిన్లలో ఒకరిగా మలర్ అనే టీచర్ పాత్రలో సాయిపల్లవి నటించారు. 2015లో వచ్చిన ఈ సినిమా బ్రహ్మండమైన విజయాన్ని సాధించింది. తెలుగులో నాగ చైతన్యతో ఈ సినిమాను రీమేక్ చేశారు. నిజానికి ప్రేమమ్ సినిమా తర్వాత నటనకు గుడ్‌బై చెప్పి వైద్య వృత్తి చేపట్టాలని అనుకున్నారు సాయిపల్లవి.
కానీ ఆ చిత్రం సూపర్‌హిట్ కావడం, ఆమె నటన అందరినీ ఆకట్టుకోవడంతో అవకాశాలు కుప్పలు తెప్పలుగా వచ్చిపడ్డాయి. తమిళం, తెలుగు వంటి ఇతర భాషల్లోనూ అవకాశాలు వచ్చాయి. అలా నటనను కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొంది. సాయిపల్లవిలో మరో సుగుణం ఏమిటంటే వచ్చన ప్రతీ పాత్రను ఒప్పుకోకపోవడం. పాత్ర బాగుంటేనే అది కూడా తనకు నచ్చిన, తనకు నప్పిన పాత్రలనే ఎంపిక చేసుకుంటున్నారు. కమర్షియల్ యాడ్స్‌కు దూరంగా ఉంటారు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతారు. అందుకే సాయి పల్లవి మిగతా వారి కంటే భిన్నం. సాయిపల్లవి చివరి సారిగా గార్గి సినిమాలో నటించారు. ఈ సినిమా తర్వాత సాయి పల్లవి ఖాళీగానే ఉంటున్నారు. అలాగని ఛాన్సలు లేక కాదు, ఉద్దేశపూర్వకంగానే గ్యాప్ తీసుకున్నారు. ప్రస్తుతం కమలహాసన్(Kamal Hassan) నిర్మిస్తున్న ఓ సినిమాలో శివ కార్తికేయన్‌కు(shiva Karthikeyan) జోడిగా నటిస్తున్నారు.