సాయిపల్లవి(Sai Pallavi) గొప్ప నటి.. విభిన్నమైన వ్యక్తిత్వం. తనకు పాత్ర నచ్చితేనే ఓకే చెబుతారు. సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అందుకే ఆమెకు ఇంత గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఆమెకు బాలీవుడ్‌లో కూడా ఛాన్స్ వచ్చింది. అది మామూలు అవకాశం కాదు.. ఏకంగా సీతమ్మ పాత్రనే ఆమెను వరించింది. నితేష్ తివారీ(Nithesh Tiwari) మరోసారి రామాయణాన్ని వెండితెర కావ్యంగా మలచాలనుకుంటున్నారు.
సాయిపల్లవి(Sai Pallavi) గొప్ప నటి.. విభిన్నమైన వ్యక్తిత్వం. తనకు పాత్ర నచ్చితేనే ఓకే చెబుతారు. సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అందుకే ఆమెకు ఇంత గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఆమెకు బాలీవుడ్‌లో కూడా ఛాన్స్ వచ్చింది. అది మామూలు అవకాశం కాదు.. ఏకంగా సీతమ్మ పాత్రనే ఆమెను వరించింది. నితేష్ తివారీ(Nithesh Tiwari) మరోసారి రామాయణాన్ని వెండితెర కావ్యంగా మలచాలనుకుంటున్నారు. ఇందులో సీత పాత్రకు సాయి పల్లవి అయితే బాగుంటుందనే నిశ్చతాభిప్రాయానికి నితేష్ తివారీ వచ్చేశారు. ఇది సాయిపల్లవికి అమితానందాన్ని కలిగిస్తోంది. ఆయన తనలో సీతమ్మను చూశారనే ఫీలింగే చాలా బాగుందని, నిజంగా ఇది అరుదుగా దొరికే అదృష్టమని సాయిపల్లవి ఆనందం వ్యక్తిం చేస్తున్నారు. సాయిపల్లవి త్వరలోనే వెండితెరపై మహాసాద్వి సీతగా కనిపించనున్న విషయం తెలిసిందే. తనకు ఈ పాత్ర దొరకడంపట్ల సాయిపల్లవి చెన్నయ్‌లోని ఓ ప్రైవేటు కార్యక్రమంలో ఆనందం వ్యక్తం చేశారు. ఎప్పడెప్పుడు షూటింగ్‌కి పిలుస్తారా అని ఎదురుచూస్తున్నాను అని చెప్పారు. 'ఇది నాకో ఛాలెంజ్. ఎందుకంటే లెజెండ్రీ ఆర్టీస్టులు చేసిన పాత్ర అది. వారు చేసిన దాంట్లో టెన్ పర్సంట్ చేసినా బాగా చేసినట్టే. త్వరలోనే కథ వినడానికి ముంబాయ్ వెళ్లబోతున్నాను. రామాయణం(Ramayanam) అందరికీ తెలిసిందే. అయితే నితేశ్ రామాయణాన్ని వినడానికి ఆతృతగా ఉన్నా. ఇండియన్ స్క్రీన్‌పై చాలా రామాయణాలు వచ్చాయి. కానీ వాల్మీకి రామాయణాన్ని ఎవరూ పరిపూర్ణంగా చెప్పలేదు. ఈ సినిమా ఆ లోటును తీరుస్తుందనే ఆశతో ఉన్నాను. మరోసారి నితేశ్ తివారికి థాంక్స్. నాలో సీతమ్మని చూసినందుకు’ అంటూ తెగ ఆనందపడిపోయారు సాయిపల్లవి.