ప్రముఖ హీరోయిన్ సాయి పల్లవి(Sai Pallavi) ఇంట్లో పెళ్లి భాజాలు మోగనున్నాయి. తమిళంలో చిత్తరాయి సెవ్వనం సినిమాతో హీరోయిన్‌గా పరిచమైన పూజా కన్నన్ తొలి సినిమాతోనే నటనపరంగా ప్రశంసలు పొందింది. కానీ ఆ తర్వాత సినిమాలో నటించలేదు. పూజా కన్నన్(Pooja Kannan) తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది.
ప్రముఖ హీరోయిన్ సాయి పల్లవి(Sai Pallavi) ఇంట్లో పెళ్లి భాజాలు మోగనున్నాయి. తమిళంలో చిత్తరాయి సెవ్వనం సినిమాతో హీరోయిన్‌గా పరిచమైన పూజా కన్నన్ తొలి సినిమాతోనే నటనపరంగా ప్రశంసలు పొందింది. కానీ ఆ తర్వాత సినిమాలో నటించలేదు. పూజా కన్నన్(Pooja Kannan) తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది. వినీత్(Vineet) అనే వ్యక్తి ఇప్పుడు తన లైఫ్ జీవిత భాగస్వామి కాబోతున్నాడంటూ పరిచయం చేసింది. అంతేకాదు.. అతడి ఫోటోను షేర్ చేసింది. అయితే అతడికి సంబంధించిన పూర్తి విషయాలను మాత్రం పూజ చెప్పలేదు.
ఈ సందర్భంగా తనకు కాబోయే భర్తను పరిచయం చేసతూ “ఈ క్యూట్ బటన్ నిస్వార్థమైన ప్రేమ, ఓపికగా ఉండడం.. ఎప్పుడూ ప్రేమతో ఉండడం నేర్పించింది. ఇతను వినీత్.. నా సన్ షైన్. మొన్నటి వరకు నా క్రైం పార్ట్ నర్. ఇప్పుడు నా లైఫ్ పార్ట్ నర్ కాబోతున్నాడు. ఐ లవ్ యూ మై పార్ట్ నర్” అనిన ఇన్ స్టాగ్రాంలో(nstagram) రాసుకొచ్చింది పూజా. దీనిపై సినీ ప్రముఖులు, సన్నిహితులు, అభిమానులు పూజకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే గతంలో సాయి పల్లవి పెళ్లి చేసుకోబోతుందంటూ సోషల్ మీడియాలో(Social media) వార్తలు వచ్చినా నేచురల్ బ్యూటీ స్పందించలేదు. తాజాగా తన చెల్లి పెళ్లి పీటలు ఎక్కబోతుండడంతో సాయిపల్లవి పెళ్లి ఎప్పుడు అనే అంశం ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.