స్టార్ వారసురాలు కాదు.. సినిమా బ్యాక్ గ్రౌండ్ లేదు.. భారీగా ఆస్తులు కూడా లేవు.. కాని సాయి పల్లవి(Sai Pallavi) హీరోయిన్ గా తను అనుకున్నట్టుగానే.. నచ్చిన సినిమాలే.. చేస్తుంది. నచ్చినట్టుగానే ఉంటుంది. ఇష్టం లేని సినిమాలను ఎంత స్టార్ హీరో జోడీగా అవకాశం వచ్చినా నిర్మోహమాటంగా నో చెప్పేస్తుంది బ్యూటీ.

స్టార్ వారసురాలు కాదు.. సినిమా బ్యాక్ గ్రౌండ్ లేదు.. భారీగా ఆస్తులు కూడా లేవు.. కాని సాయి పల్లవి(Sai Pallavi) హీరోయిన్ గా తను అనుకున్నట్టుగానే.. నచ్చిన సినిమాలే.. చేస్తుంది. నచ్చినట్టుగానే ఉంటుంది. ఇష్టం లేని సినిమాలను ఎంత స్టార్ హీరో జోడీగా అవకాశం వచ్చినా నిర్మోహమాటంగా నో చెప్పేస్తుంది బ్యూటీ.

అలా అని ఆమె ఇండస్ట్రీలో టార్గెట్ అవ్వలేదు. అవకాశాలు రాకుండా పోలేదు. ఇప్పటికీ ఆమె గుమ్మం ముందు గ్రీన్ సిగ్నల్ కోసం ఎంతో మంది నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. అప్పటికీ.. ఇప్పటికీ.. సాయి పల్లవి(Sai Pallavi) గ్లామర్ లో కాని, ఫిజిక్ లో కాని ఏమాత్రం తేడా రాలేదు. అదే నాజూకు సోకులతో సందడి చేస్తుంది బ్యూటీ. మేకప్ లేకుండానే నటిస్తూ ఎంతో మంది ఫ్యాన్స్ ను సంపాదించుకుంది చిన్నది.

సాయి పల్లవి(Sai Pallavi)కి సౌత్ లో.. ముఖ్యంగా.. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో మంచి క్రేజ్ ఉంది. ఇక ఈమూడుభాషల్లో కంపైర్ చేసుకుంటే.. తెలుగులో మిగతా భాషల్లో కంటే సాయిపల్లవికి ఉన్న ఫాలోయింగ్ ఎక్కువ. తెలుగులో సాయిపల్లవి (Sai Pallavi)ఒక సినిమా చేసిందంటే, సహజంగానే ఆ సినిమాపై అంచనాలు పెరిగిపోతుంటాయి.

సాయి పల్లవి(Sai Pallavi) సినిమా ఒప్పుకుంది అంటే.. ఆ సినిమాలో కథ మంచిగా ఉంటుంది. హీరోయిన్ కు యాక్టింగ్ స్కోప్ ఎక్కువగా ఉంటుంది. అంతే కాని ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ప్రకారం.. ఏదో బ్యూటీ కోసం హీరోయిన్ ను తీసుకోవడం కాకుండా.. హీరోకు ఏమాత్రం తీసిపోని పాత్రల్లో ఆమె నటిస్తుంది. ఆమె సినిమా చేస్తుందంటే.. ఆ సినిమాలో వైవిధ్యభరితమైన కంటెంట్ ఉండే ఉంటుందనే నమ్మకం ఆడియన్స్ లో పెరుగుతూ వెళుతుంది.

ఇక సాయిపల్లవి(Sai Pallavi) నేచురల్ యాక్టింగ్ ఒక ఎత్తయితే.. ఆమె డాన్స్(Dance) ఒక ఎత్తు.. డాన్స్ విషయంలో ఆమెకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ప్రస్తుతం ఆమె తెలుగులో చేయడానికి సరైన కథ కోసం వెయిట్ చేస్తుంది.ఇక రీసెంట్ గా సాయి పల్లవి తన ఫిట్ నెస్ సీక్రేట్ ను బయట పెట్టారు. ఇంత ఫిట్ గా.. నాజూగ్గా ఉండటానికి కారణాలు వెల్లడించారు.

తాజా ఇంటర్వ్యూలో సాయిపల్లవి(Sai Pallavi) మాట్లాడుతూ .. మేకప్ వేసుకుంటే నాపై ఒత్తిడి ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అందువలన నేను బయట ఎలా ఉంటానో అలాగే కెమెరా ముందుకు రావడానికి ఇష్టపడతాను అని అన్నారు. ఇక ఫిట్ నెస్ గురించి మాట్లాడుతూ.. అంతా ఇదే అడుగుతుంటారు... ఫిట్ గా కనిపించడానికి మీరు ఏం చేస్తుంటారు అని కాని నేను దాని కోసం ప్రత్యేకంగా ఎలాంటి కసరత్తులు చేయను. అన్నారు సాయి పల్లవి.

అయితే ఇలా నాజూగ్గా ఉండటానికి కారణం మాత్రం డాన్స్ అని అంటుంది సాయి పల్లవి. ఏ మాత్రం ఖాళీ దొరికినా నేను డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటాను. అదే నా ఫిట్ నెస్ కి కారణం. నాకు ఎంతో ఇష్టమైన డాన్స్(Dance) నాకు ఇంతటి పేరు ప్రతిష్ఠలను తెచ్చిపెడుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు అంటూ.. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించింది సాయి పల్లవి(Sai Pallavi).

Updated On 4 April 2023 12:15 AM GMT
Ehatv

Ehatv

Next Story