సాయి పల్లవి(Sai Pallavi) అంత తేలిగ్గా సినిమలు కమిట్ అవ్వదు. హీరోయిన్ పాత్ర బాగుండాలి.. నటించే అవకాశం ఉండాలి. హీరో పాత్ర డామినేట్ చేయకూడదు.. వాటికి అనుగూణంగా కథ ఉంటేనే సినిమా కమిట్ అవుతుందట సాయి పల్లవి. అలా సెలక్టెడ్ గా సినిమాలు చేయడంతోనే ఆమెకు స్పెషల్ ఇమేజ్ వచ్చింది. మరీ ముఖ్యంగా కమర్షియల్ సినిమాలకు కాస్త దూరంగా ఉంటుంది బ్యూటీ. ఒక వేళ చేసినా.. అందులో తన పాత్ర ఎలా ఉంది అనేది చూసుకుంటుంది.

ఇక తాజాగా వనిపిస్తున్నవార్తల్లో నిజం ఎంతో తెలియదు కాని.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Am charan) జోడీగా సాయి పల్లవి నటిస్తోందని సమాచారం. రామ్‌చరణ్‌ ప్రస్తుతం శంకర్‌(Shankar) గేమ్‌ఛేంజర్‌(Game changer) సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇండియన్ 2(Indian 2) చేస్తున్నశంకర్..ఈ సినిమాను కాస్త వెయిటింగ్ లో పెట్టాడు. దాంతో చరణ్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. గేమ్ ఛేంజర్‌ సమ్మర్‌లో విడుదల చేయనున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇదిలావుంటే.. రామ్‌చరణ్‌ హీరోగా నెక్ట్స్ సినిమాను ఉప్పెన ఫేం బుచ్చిబాబు సన(Buchi Babu Sana) డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈసినిమాలో హీరోయిన్ గా రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే కొంత మంది పేర్లు బయటకు వచ్చాయి..కాని కన్ ఫార్మ్ చేయలేదు. అందులో ముందు మృణాళ్‌(Mrunal Thakkur) పేరుబయటకు వచ్చింది. ఆతరువాత జాన్వీ కపూర్‌(Janhvi) పేరు లైన్లోకొచ్చింది. ఇప్పుడు వీళ్లిద్దరూ కాదు సాయిపల్లవి అని కొత్త వార్త మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నది. రూరల్‌ నేపథ్యంలో సాగే ఈ స్పోర్ట్స్‌ డ్రామా కావడంతో హీరోయిన్ గా సాయిపల్లవి అయితేనే బాగుంటందని బుచ్చిబాబు భావించాడట. సాయిపల్లవి కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలుస్తున్నది.

ఈ కథలో పల్లెటూరి అమ్మాయిగా.. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర కావడంతో.. సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. అంతే కాదు త్వరలోనే షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమాలో విజయసేతుపతి కీలక పాత్రలో నటించబోతున్నారు. మైత్రీమూవీమేకర్స్‌ సమర్పణలో వెంకట సతీష్‌ కిలారు వృద్ధి సినిమాస్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ బానర్లపై నిర్మించనున్న ఈ చిత్రానికి ఏ.ఆర్‌.రెహమాన్‌ సంగీతం అందించబోతున్నారు.

Updated On 18 Nov 2023 8:01 AM GMT
Ehatv

Ehatv

Next Story