సాయి పల్లవి ఆలోచనలు వేరు. ఆమె సినిమాల రూటే సెపరేట్.. పిచ్చి పిచ్చిగా అన్ని సినిమాలు ఒకే చెప్పదు. కథ నచ్చాలి. హీరో డామినేషన్ ఎక్కవగా అవ్వకూడదు. అంతే కాదు హీరోయిన్ క్యారెక్టర్ కు యాక్టింగ్ స్కోప్ ఉండాలి. ఇలా చాలా కండీషన్లతో.. సినిమా ఒప్పుకుంటుంది. అంతే కాదు. ఎంత పెద్ద స్టార్ హీరో పక్కన ఆఫర్ వచ్చినా సరే.. కథ విని తనకు నచ్చితేను ఓకే చెపుతుంది కాని..

సాయి పల్లవి(Sai Pallavi) ఆమె ఆటీట్యూడ్ కు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అంత పద్దతిగా కనిపిస్తుంది సాయి పల్లవి. ఎందుకో ఈమధ్య చాలా గ్యాప్ వచ్చింది సాయి సినిమాలకు. మరి ఆ విషయంలో ఆమె ఏమంటుందంటే..?

సాయి పల్లవి ఆలోచనలు వేరు. ఆమె సినిమాల రూటే సెపరేట్.. పిచ్చి పిచ్చిగా అన్ని సినిమాలు ఒకే చెప్పదు. కథ నచ్చాలి. హీరో డామినేషన్ ఎక్కవగా అవ్వకూడదు. అంతే కాదు హీరోయిన్ క్యారెక్టర్ కు యాక్టింగ్ స్కోప్ ఉండాలి. ఇలా చాలా కండీషన్లతో.. సినిమా ఒప్పుకుంటుంది. అంతే కాదు. ఎంత పెద్ద స్టార్ హీరో పక్కన ఆఫర్ వచ్చినా సరే.. కథ విని తనకు నచ్చితేను ఓకే చెపుతుంది కాని.. హీరో కోసం సినిమా ఒప్పుకోదు బ్యూటీ. హీరోయిన్ పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటేనే ఆ సినిమాలో నటిస్తుంది.

ఈ మధ్య పెద్దగా కనిపించడంలేదు సాయి పల్లవి. సినిమాలకు గ్యాప్ ఇచ్చిందా.. లేక ఆమధ్య ప్రచారం జరిగినట్టు అసలు సినిమాలే వదిలేసిందా అనే అనుమానం ఫ్యాన్స్ లో కలిగిది. ఇక ఈ తమిళ సోయగం ప్రేమమ్‌(Premam) సినిమాతో హీరోయిన్ గా ఫిల్మ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. సౌత్ సినిమాలో అన్ని కండీషన్లు పెడుతున్నా.. హీరోయిన్ గా మాత్రం స్టార్ డమ్ సంపాదించింది బ్యూటీ. ఫస్ట్ సినిమాతోనే ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది బ్యూటీ. ఇక ఈమూవీ రిలీజ్ అయ్యి ఎనిమిదేండ్లు పూర్తయ్యాయి.
అంటే సాయి పల్లవి ఫిల్మ్ కెరీర్ కూడా ఏనిమిదేళ్లు పూర్తి చేసుకుంది.

ప్రేమమ్ 8 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా. ప్రేమమ్‌ హ్యాష్‌టాగ్‌ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.సాయి పల్లవి అంటే ఇష్టపడని వారంటూ ఉండరు. చాలామందికి ఆమె ఆదర్శం కూడా. డాక్టర్ చదువుకుంటూనే సినిమాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది బ్యూటీ. ఈమధ్య సినిమాలు తగ్గించింది చిన్నది. అయితే ఈమధ్య సినిమాలకు కాస్త దూరంగా ఉంటోనన సాయి పల్లవి.. టాలీవుడ్ లో అయితే అసలు సినిమాలే చేయడం మానేసింది. ఇతర భాషల్లో అయినా.. అడపా దడపా సినిమాలున్నాయి కాని.. తెలుగులో మాత్రం సాయి సినిమా ఒక్కటి కూడా లేదు.

ఈ విషయంలో ఆమెను ప్రశ్నించగా.. తెలుగులో తనకు గ్యాప్‌ రాలేదని, తానే తీసుకున్నానని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో సాయిపల్లవి వెల్లడించింది . అయితే దానికి పెద్ద కారణాలేమి లేవంటోంది బ్యూటీ. మంచి కథ దొరకితే లో సినిమాలు చేయడానికి రెడీ అంటోంది సాయి పల్లవి. ఇక ప్రస్తుతానికిఆమె శివ కార్తికేయన్‌ సరసన ఓ తమిళ సినిమాలో నటిస్తోంది. తమిళనాట నేచురల్ స్టార్ గా పేరు ఉన్న శివకార్తికేయన్ తో సినిమాపై భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి.

Updated On 1 Jun 2023 12:35 AM GMT
Ehatv

Ehatv

Next Story