నటన, అందం, డాన్స్, ఇలా ఏ విషయంలో చూసుకున్నా.. నేచురల్ గా ఉంటుంది సాయి పల్లవి. అందుకే ఆమె నేచురల్ స్టార్ అయ్యింది. అంతే కాదు.. లేడీ పవర్ స్టార్ గా మంచి పేరు తెచ్చుకుంది బ్యూటీ. అవ్వడానికి తమిళ బ్యూటీనే అయినా.. తెలుగుదనం ఉట్టిపడేలా కనిపించే సాయి పల్లవి.. డాన్స్ లో(Dance) బాగా నేర్పరి. ఈ మధ్య పెద్దగా వెండితెరపై కనిపించడంలేదు సాయి పల్లవి. తాజాగా కాశ్మీర్ లో ప్రత్యక్ష్యం అయ్యింది బ్యూటీ. తాజాగా కొత్త స్టిల్స్‌తో అందరి మనసు దోచుకుంటోంది.

చాలా కాలం తరువాత తాజాగ కాశ్మీర్(Kashmir) లో ప్రత్యక్ష్యం అయ్యింది.. నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi). అక్కడ అందాలు ఆస్వాదిస్తోంది.

నటన, అందం, డాన్స్, ఇలా ఏ విషయంలో చూసుకున్నా.. నేచురల్ గా ఉంటుంది సాయి పల్లవి. అందుకే ఆమె నేచురల్ స్టార్ అయ్యింది. అంతే కాదు.. లేడీ పవర్ స్టార్ గా మంచి పేరు తెచ్చుకుంది బ్యూటీ. అవ్వడానికి తమిళ బ్యూటీనే అయినా.. తెలుగుదనం ఉట్టిపడేలా కనిపించే సాయి పల్లవి.. డాన్స్ లో(Dance) బాగా నేర్పరి. ఈ మధ్య పెద్దగా వెండితెరపై కనిపించడంలేదు సాయి పల్లవి. తాజాగా కాశ్మీర్ లో ప్రత్యక్ష్యం అయ్యింది బ్యూటీ. తాజాగా కొత్త స్టిల్స్‌తో అందరి మనసు దోచుకుంటోంది.

సాయిపల్లవి ప్రస్తుతం శివకార్తికేయన్‌ (Sivakarthikeyan)తో కలిసి ఎస్‌కే 21లో(SK21) నటిస్తోంది. రాజ్‌కుమార్‌ పెరియసామి(Rajkumar Periyasa) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కశ్మీర్ లో జరుగుతోంది. దాదాపు నెలరోజుల వరకూ అక్కడే షూటింగ్ చేయబోతున్నారు. శికార్తికేయన్ జోడీగా ఈ మూవీలో సాయ ిపల్లవి నటిస్తోంది. కశ్మీర్ లో షూటింగ్ జరుగుతుండగా.. అక్కడ లోకేషన్ లో షూటింగ్ బ్రేక్ లో.. ఫిదా హీరోయిన్ ఎంజాయ్ చేస్తోంది. సాయిపల్లవి కశ్మీర్‌ లొకేషన్‌లో దిగిన ఫొటోలు ఇప్పటికే నెటిజన్ల మనసు దోచేస్తున్నాయి.

వైట్‌ అండ్ వైట్ డ్రెస్‌లో జాలువారు కురులతో కశ్మీర్‌ అందాలను ఆస్వాదిస్తున్న సాయిపల్లవి స్టిల్స్‌ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఓ వైపు కశ్మీర్‌ అందాలు.. మరోవైపు సాయిపల్లవి సందడి ఒకే ఫ్రేమ్‌లో కనిపించేవరకూ నెటిజన్లు తెగ సంతోషపడుతున్నారు. సాయి పల్లవిని చూడటానికి రెండు కళ్లు చాలడం లేదు అంటున్నారు నెటిజన్లు.

SK21లో విశ్వరూపం ఫేం రాహుల్ బోస్‌ (RahulBose) విలన్‌గా నటిస్తున్నాడు. కశ్మీర్‌లో SK21 చిత్రీకరణ ఈ నెలాఖరు వరకు కొనసాగనుంది. శివ‌కార్తికేయ‌న్ ప్రస్తుతం మ‌డొన్నే అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న మావీరన్‌లో నటిస్తున్నాడు. జులై 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. త్వరలోనే SK21 షూటింగ్‌లో జాయిన్ కానున్నాడు.

Updated On 12 July 2023 7:10 AM GMT
Ehatv

Ehatv

Next Story