యాక్సిడెంట్ తర్వాత సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) చేస్తున్న హారర్ థ్రిల్లర్ సినిమా విరూపాక్ష(Virupaksha). ఏప్రిల్ 21న విడుదలకానున్న ఈ సినిమాకి డైరెక్టర్ సుకుమార్ (Sukumar) అసిస్టెంట్ కార్తీక్ దండు(Karthik Dandu) దర్శకత్వం వహిస్తున్నాడు. హీరోయిన్‏గా సంయుక్తా మీనన్ (Samyuktha Menon) చేస్తోంది. మొన్న టీజర్‏ను విడుదల చేయగా.. ఇవాళ హైదరాబాద్‏లో చిత్ర యూనిట్ హార్డ్ హిట్టింగ్ ట్రైలర్‏ను విడుదల చేశారు.

మెయిన్ లీడ్ అయిన సాయి ధరమ తేజ్(Sai Dharam Tej) తన పూర్వీకుల గ్రామానికి వెళ్లడంతో ట్రైలర్ మొదలవుతుంది.అక్కడికి వెళ్లాక బబ్లీగా ఉన్న సంయుక్తా మీనన్‏తో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత గ్రామంలో కొన్ని వింత సమస్యలు కనిపిస్తాయి. దాంతో ఆ గ్రామంలో పూజా కార్యక్రమాలు మానేయాలని.. గ్రామాన్ని మూసివేయాలన్న డైలాగ్స్ సాయిచంద్(Sai Chand) చెప్పడం ఇంట్రెస్టింగ్‏గా అనిపించింది. ఇలా చాలా ఆసక్తికరమైన విషయాలు ట్రైలర్‏లో చూపించారు. అసలు ఆ గ్రామంలో ఏం జరుగుతోందనేది తెలుసుకోవాలనేలా ట్రైలర్ కట్ చేశారు మేకర్స్.

మన ఎక్స్‏పెక్టేషన్స్‏కు అనుగుణంగా శ్రీ నాగేంద్ర తంగాల(Sri Nagendra Tangala) ప్రొడక్షన్ డిజైన్ ఉంది. అక్కడి వాతావరణం ఇంటెన్స్‏ని క్రియేట్ చేసి.. హంటెడ్ గ్రామంగా చూపించారు. ఇక బి.అజనీష్ లోక్‏నాథ్ (Ajaneesh loknath) అందించిన బ్యాక్‏గ్రౌండ్ స్కోర్ సస్పెన్స్ కాస్త ఎక్కువగా ఎలివేట్ చేస్తుంది. సాయి ధరమ్ తేజ్ లుక్ కూడా చాలా డీసెంట్‏గా కనిపిస్తోంది. ఫస్ట్ టైమ్ థ్రిల్లర్ (Thriller) సినిమా చేస్తున్నా.. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ బావుంది.

ఇక ఈ సినిమాలో అజయ్, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ట్రైలర్ మొత్తం చేసినట్లయితే విజువల్స్ వండర్స్ కోసం డైరెక్టర్ కార్తీక్ దండు (Karthik Dandu) చాలా కష్టపడినట్టు కనిపిస్తోంది. విరూపాక్ష (Virupaksha)లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‏ని చేశాడనేది మనకు ట్రైలర్‏లో స్పష్టంగా కనిస్తోంది. స్టార్ ఫిల్మ్ మేకర్ సుకుమార్ (Sukumar) కథ, స్క్రీన్ ప్లేతో రూపొందిన విరూపాక్ష చిత్రం ట్రైలర్‏లో చూపించిన సీన్సన్నీ డిఫరెంట్‏గా మైస్టిక్ థ్రిల్లర్‏లా కనిపిస్తాయి.

మొత్తానికి ఈ ట్రైలర్‏తో సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యేలా చేసేలా చేశారు మేకర్స్. నిజంగా ట్రైలర్‏లో చూపించినంతగా సినిమా మొత్తం కూడా అదే టెంపోలో ఉంటే మాత్రం విరూపక్ష చిత్రం సూపర్ హిట్‏గా నిలుస్తుందంటున్నారు ఫిల్మ్ లవర్స్.

Updated On 11 April 2023 4:15 AM GMT
Ehatv

Ehatv

Next Story