ఏప్రిల్ 21న కార్తీక్ దండు(Karthik Varma Dandu) దర్శకత్వంలో సుప్రీం హీరో సాయిధర్మ తేజ(Sai Dharam Tej), సంయుక్తా మీనన్(Samyuktha Menon) కాంబినేషన్‌లో ఎస్‌విసిసి బ్యానర్‌పైన సుప్రసిద్ధ నిర్మాత బివిఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన డార్క్ ఫాంటసీ విరూపాక్ష(Virupaksha) చిత్రం మొదటివారంలోనే అత్యధిక వసూళ్ళతో తొలివారం రికార్డు సృష్టించి సంచలనం రేపింది. సాయిధర్మతేజ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా, మైల్ స్టోన్‌గా నమోదై, రికార్డ్ బ్రేక్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

Virupaksha Box Office Collections
ఏప్రిల్ 21న కార్తీక్ దండు(Karthik Varma Dandu) దర్శకత్వంలో సుప్రీం హీరో సాయిధర్మ తేజ(Sai Dharam Tej), సంయుక్తా మీనన్(Samyuktha Menon) కాంబినేషన్‌లో ఎస్‌విసిసి బ్యానర్‌పైన సుప్రసిద్ధ నిర్మాత బివిఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన డార్క్ ఫాంటసీ విరూపాక్ష(Virupaksha) చిత్రం మొదటివారంలోనే అత్యధిక వసూళ్ళతో తొలివారం రికార్డు సృష్టించి సంచలనం రేపింది. సాయిధర్మతేజ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా, మైల్ స్టోన్‌గా నమోదై, రికార్డ్ బ్రేక్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. రెండోవారంలోనే ఆలిండియా స్థాయిలో ఇటీవలి రోజులలో దసరా చిత్రం తర్వాత ఇంత దుమారం రేపిన చిత్రం మరొకటి లేదు. ప్రస్తుతం 80 కోట్లకు పైచిలుక వసూలు చేసి, వందకోట్ల క్లబ్‌వైపుకి దూసుకెళ్ళే దిశగా పరుగులు తీస్తోంది.
ధమాకా చిత్రం తర్వాత వందకోట్ల క్లబ్‌లో స్థానం సంపాదించుకున్న చిత్రం దసరా అయితే, ఆ తర్వాత మళ్ళీ విరూపాక్షకే ఆ రికార్డు సొంతమైంది. తమిళంలో కూడా ఎదురులేకుండా, అక్కడి చిత్రాలను కూడా క్రాస్ చేసి మరీ ఆడుతోంది. వాస్తవం చెప్పాలంటే ఇతర భాషల్లో కూడా ఇంత సంచలనం సృష్టించిన సినిమా విరూపాక్ష ఒక్కటే. ఏడేళ్ళు ఒకే స్క్రిప్టు పట్టుకుని, మరోవైపు ప్రాణం ప్రమాదంలో ఉన్నా మొక్కవోని విశ్వాసంతో కృషి చేసిన యువదర్శకుడు కార్తీక్, దాదాపుగా ప్రాణాలు కోల్పోయినంత ప్రమాదం జరిగి మళ్ళీ కోలుకుని, శ్రమదమాదులను తట్టుకుని నిలబడ్డ సుప్రీం సాయిధర్మతేజ-ఇద్దరికీ ఇద్దరూ అజేయులనిపించుకున్నారు. సుకుమార్ కాంబినేషన్‌లోనే కాదు, సుకుమార్ ప్రోత్సహించి, సూచించిన కథను స్వీకరించి, బడ్జెట్‌కి రాజీపడకుండా నిర్మించిన బివిఎస్‌ఎన్ ప్రసాద్, బాపినీడు విరూపాక్ష చిత్రం ద్వారా దాదాపుగా చరిత్రనే సృష్టించారని చిత్రపరిశ్రమ యావత్తూ ముక్తకంఠంతో అభినందలను తెలియజేస్తోంది.
సీక్వెల్ ఉందా.. నిజమేనా?
క్వెల్స్ అండ్ పార్ట్ టూలు సర్వసాధారణమైపోయిన ప్రస్తుతకాలంలో ఇంత గొప్ప విజయం సాధించిన విరూపాక్షకి సీక్వెల్ ఉండకపోతుందా అనేది అందరి సంశయం. ఉంటే బావుంటుందనేది ఆశ. కానీ ఇంత తొందరగా పార్ట్ 2 కథను సిద్ధం చేయడం అంత సులభం కాదు. రెండు కార్తీక్ ఆ ప్రయత్నంలో కూడా ఉన్నట్టుగా ఆయన సన్నిహితులు తేల్చడం లేదు. కాకపోతే, విరూపాక్ష విజయంతో మాత్రం సుప్రీం సరేసరి ఎక్కడో చుక్కల్లో ఉన్నాడు. కార్తీక్ కూడా పరిశ్రమలోని చాలా ప్రొడక్షన్ హౌస్‌ల్లో బాగా చర్చకు వస్తున్నాడు. మొన్నేదో ఓ ఇంటర్వ్యూలో సాయిధర్మతేజ పార్ట్ 2 గురించి కొంచెం పాజిటివ్‌గా ముచ్చటించడంతో సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు ఆ పనిమీదనే ఉంటోంది. కానీ ఎక్కడ నుంచి కూడా కన్ఫర్మేషన్ అయితే లేదిప్పటి వరకూ. " Written By Nagendra Kumar"
