✕
Virupaksha Movie: విచ్చుకత్తిలా మెరుస్తున్న విరూపాక్ష...విడుదలకు ముందే సక్సెస్ జోరు, హోరు..!
By EhatvPublished on 19 April 2023 8:18 AM GMT
కొన్ని సినిమాలకు ఎలా అంత క్రేజ్ వస్తుందంటే ఇదమిద్ధంగా సమాధానంగానీ, సంజాయిషీగానీ చెప్పలేం. అంతే ప్రారంభించిన ఆ వేళా విశేషమో, లేదా ఆ ముహూర్తబలమో....సదరు సినిమాలకి ఆ వెలుగునీ, జిలుగునీ తెచ్చిపెడతాయంటే నమ్మితీరాలి. ఇప్పుడు సుప్రీం హీరో సాయిధర్మతేజ్ హీరోగా దండు కార్తీక్ దర్శకత్వంలో భోగవల్లి బాపినీడు నిర్మించిన విరూపాక్ష చిత్రం ప్రచారకార్యక్రమాలను ఆరంభించినప్పటినుంచీ అనూహ్యమైనరీతిలో ఊపందుకుంది. అది మరి ఎస్విసిసి బ్యానర్ మహిమో, అనుగ్రహమో! ఎవరినోట విన్నా విరూపాక్ష చిత్రం గురించే. అయితే నిర్మాత బాపినీడు చాలా విలక్షణమైన పోకడలో మొదలు పెట్టిన పాత్రల పరిచయం కార్యక్రమం దగ్గరనుంచీ చూస్తే అది తీసుకొచ్చిన సందడి ఇంతాఅంతా కాదు.

x
Virupaksha
-
- కొన్ని సినిమాలకు ఎలా అంత క్రేజ్ వస్తుందంటే ఇదమిద్ధంగా సమాధానంగానీ, సంజాయిషీగానీ చెప్పలేం. అంతే ప్రారంభించిన ఆ వేళా విశేషమో, లేదా ఆ ముహూర్తబలమో....సదరు సినిమాలకి ఆ వెలుగునీ, జిలుగునీ తెచ్చిపెడతాయంటే నమ్మితీరాలి. ఇప్పుడు సుప్రీం హీరో సాయిధర్మతేజ్ హీరోగా దండు కార్తీక్ దర్శకత్వంలో భోగవల్లి బాపినీడు నిర్మించిన విరూపాక్ష చిత్రం ప్రచారకార్యక్రమాలను ఆరంభించినప్పటినుంచీ అనూహ్యమైనరీతిలో ఊపందుకుంది. అది మరి ఎస్విసిసి బ్యానర్ మహిమో, అనుగ్రహమో! ఎవరినోట విన్నా విరూపాక్ష చిత్రం గురించే. అయితే నిర్మాత బాపినీడు చాలా విలక్షణమైన పోకడలో మొదలు పెట్టిన పాత్రల పరిచయం కార్యక్రమం దగ్గరనుంచీ చూస్తే అది తీసుకొచ్చిన సందడి ఇంతాఅంతా కాదు.
-
- అందుకే సుప్రసిద్ధ నిర్మాత ఛత్రపతి ప్రసాద్ అని ప్రముఖంగా వ్యవహరించబడే భోగవల్లి ప్రసాద్ గారు విరూపాక్ష చిత్రం పూర్తిగా తన కుమారుడు బాపినీడు నిర్మించిన చిత్రమని సగర్వంగా చెప్పుకొచ్చారు. నిజంగానే ట్రైలర్ విడుదల కార్యక్రమమే అటు ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, ఇటు మరో ఏస్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు నిలబడి నడిపిస్తే అది సృష్టించిన హడావుడిని వర్ణించలేం. దానికి తోడు ట్రైలర్కూడా అదిరిపోయింది. కొత్తగా ఉంది. హరర్ ధ్రిల్లర్లలో విరూపాక్షది ఓ స్పెషల్ ట్రెండ్‌లా ఫ్లాష్‌ని క్రియేట్ చేసింది. అల్లు అరవింద్ ఐమాక్స్‌లో ట్రైలర్ లాంచ్‌కి వచ్చి, వేదిక దిగిపోతూ...చాలా బాగుందయ్యా ట్రైలర్ అనుకుంటూ దిగి రావడం ఓ అప్రయత్నంగా వెలువడిన అభినందనలా అనిపించింది.
-
- పైగా ఇద్దరికిద్దరూ కూడా మామ్మూలోళ్లు కాదు. ఇద్దరి హేండ్లు కూడా ప్రపంచ ప్రఖ్యాత రెజ్లర్ మహమ్మద్ ఆలీ పిడికెళ్ళే. అందువల్ల విరూపాక్షకి సెంటిమెంటల్‌గా మాంచి హైప్ వచ్చి కూర్చుంది. దీనికి తోడు సుప్రీం తేజు ప్రమాదానికి గురై, పునర్జన్మ పొందిన అనంతరం వస్తున్న సినిమాగా కూడా విరూపాక్ష ఆత్మీయమైన సెంటిమెంట్‌ని అందుకుంది. సుప్రీం హీరో అభిమానులందరికీ ఇదో పెద్ద పండగలా కనిపిస్తోంది. పరిశ్రమ సైతం చాలా సెంటిమెంటల్‌గా విరూపాక్షపైన అభినందనలు, ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇదంతా పక్కనబెట్టి, విరూపాక్షలో సుప్రీం తేజు చూడ్డానికి టోటల్‌గా మెగాస్టార్ చిరంజీవి సూపర్ ప్రైంలో ఉన్నప్పుడు ఎలా కనిపించేవారో, టస్సా దిగిపోయాడు సుప్రీం ఇందులో. ఇంతకు ముందు ఏ సినిమాలోనూ ఇలా ఇంత హేండ్సమ్గా గానీ, ఇంత షార్ప్‌గా గానీ స్క్రీన్ ప్రజెన్స్ లేదు. సూపర్‌గా ఉన్నాడు. దాంతో అభిమానులు మరింత రెచ్చిపోతున్నారు.
-
- బంగారానికి తావి అబ్బినట్టు, విరూపాక్ష చిత్రం అసలు పురుడు పోసుకున్నదే సంచలన దర్శకుడు సుకుమార్ సైడ్ నుంచి, దీనికి స్క్రీన్‌ప్లే రాసింది, కథను ప్రోత్సహించిందీ ఆయనే కావడం విరూపాక్ష చిత్రానికి విచ్చుకత్తి లుక్‌ని తెచ్చింది. మొన్నీ మధ్యన జరిగిన ప్రచార కార్యక్రమాలలో సుకుమార్ మాట్లాడిన మాటలు బుక్మైషోని బద్దలు కొట్టేసేటట్టున్నాయి.నిర్మాత బాపినీడు ప్రచార కార్యక్రమాలను ఏకోశాన రాజీ అన్నదే లేకుండా, వీరవిహారం చేస్తున్నారు. చేయిస్తున్నారు. ఇది ఎప్పుడో రంగస్థలం షూటింగ్ టైంలో దర్శకుడు కార్తీక్ దండు, సుకుమార్‌కి చెప్పిన కథ అయిప్పటికీ కూడా ఇటీవలి ట్రెండ్ ప్రకారం హారర్ ధ్రిల్లర్ కథాకథనాలకు తిరుగులేని ఫాలోయింగ్ ఏర్పడిన మాటైతే వాస్తవం.
-
- ఈ యాంగిల్ చూస్తే ట్రైలర్ సృష్టించిన హంగామా బట్టి విరూపాక్ష చిత్రం సంచలనం సృష్టిస్తుందనే టాక్ భారీగా ఊపందుకుంది. ఇది పూర్తిగా టెక్నీషియన్స్ చిత్రం అని ముందస్తుగానే భోగవల్లి ప్రసాద్‌గారు కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు. దానిని ప్రతిబింబిస్తూ, బాపినీడు ప్రజెంట్ చేసిన ఏవిలో కూడా ఆర్ట్ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ తదితరులు వాళ్ళవాళ్ళ అనుభవాలను ఎంతో సంతృప్తిగా సమీక్షించి చెబుతుంటే అదో ఫ్రెష్నెస్లా సినిమాకి ఆసక్తికరమైన ఇమేజ్‌ని తీసుకురావడమే కాకుండా, ఆ సెట్లు, ఏకంగా ఓ గ్రామాన్నే ఏ విధంగా క్రియేట్ చేశారు ఇవన్నీ కలగలిపి విరూపాక్ష చిత్రం రఫ్ ఆడిస్తుందని ట్రేడ్ అంతా ఏకగ్రీవంగా నమ్ముతోంది. అందరితో ఏకమై, ఈహా సంస్థ కూడా చిత్రయూనిట్‌కి ముందస్తుగానే విజయాభినందనలు తెలియజేస్తోంది. శుభాకాంక్షలు అందజేస్తోంది. వెల్....విరూపాక్ష....వెల్ డన్... Written by : నాగేంద్రకుమార్

Ehatv
Next Story