పెళ్ళి గురించి ఇంట్రెస్టింగ కామెంట్స్ చేశారు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. ఇప్పట్లో ఆ ఆలోచన లేదన్న యంగ్ స్టార్.. తన లవ్ స్టోరీ గురించి మనసు విప్పి మాట్లాడారు.
పెళ్ళి గురించి ఇంట్రెస్టింగ కామెంట్స్ చేశారు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్(Sai dharam tej). ఇప్పట్లో ఆ ఆలోచన లేదన్న యంగ్ స్టార్.. తన లవ్ స్టోరీ గురించి మనసు విప్పి మాట్లాడారు.
టాలీవుడ్ లో.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో.. సాయి ధరమ్ తేజ్ ఒకరు. మెగా హీరోలలో నెక్ట్స్ పెళ్లికి రెడీగా ఉన్న హీరోలలో ముందు ఉన్నది సాయి తేజే. ఇక ఈక్రమంలో సాయి ధరమ్ తేజ్ పెళ్లి(marriage) గురించి గతంలో అనేక రూమర్స్ వచ్చాయి. ఆయన ఓ హీరోయిన్ తో క్లోజ్ గా ఉన్నాడని.. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని రూమర్స్ రావడంతో.. వాటన్నిటిని కొట్టిపారేశారు మెగా హీరో.. ఇప్పట్లోతనకు పెళ్ళి చేసుకునే ఉద్దేశ్యం లేదన్నారు. అతి పెద్ద ప్రమాదం నుంచి బయట పడిన సాయి ధరమ్ తేజ్.. ప్రస్తుతం ఫోకస్ అంతా సినిమాల మీద పెట్టాడు.
సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం విరూపాక్ష(Virupaksha). ఈనెల 21న రిలీజ్ కాబోతున్న ఈసినిమా కోసం.. వరుసగా ప్రమోషన్ ఈవెంట్స్ లో పాల్గొంటున్నాడు సాయి తేజ్. వరుస ఇంటర్య్యూలు ఇస్తున్నాడు. ఈక్రమంలో పెళ్ళెప్పుడు అని ప్రశ్న ఎదురవగ .. ఇప్పట్లో పెళ్ళి చేసుకోను అని చెప్పారు. నేను చేసుకోవాలి అనుకున్నప్పుడే చేసుకుంటాను. అంతే కాని పుకార్లు వచ్చియి కదా అని త్వరగా పెళ్లి చేసేకుందాం అని అనుకోవడంలేదు అన్నారు సాయి తేజ్. తనకు నచ్చినప్పుడే పెళ్ళి చేసుకుంటాను అన్నారు. ఇక తన లవ్ స్టోరీ గురించి కూడా చెప్పారు సాయి తేజ్. గతంలో ఓ అమ్మాయిని ప్రేమించానని. కాని అది బ్రేకప్ అయ్యిందన్నారు. అప్పటి నుంచి అమ్మాయిలు.. ప్రేమ అంటేనే భయం వేస్తోందన్నారు.
విరూపాక్షతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు సాయి ధరమ్ తేజ్. సుకుమార్ డైరెక్షన్ స్కూల్ నుంచి వచ్చిన కార్తీక్ దండు ఈసినిమాకు దర్శకుడు. సస్సెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న ఈసినిమాలో సాయి తేజ్ జోడీగా సంయుక్తా మీనన్ నటిస్తోంది. బాపినీడు సమర్పణలో.. బీవిఎస్ ఎన్ ప్రసాద్ ఈసినిమాను నిర్మిస్తున్నాడు. దర్శకుడుసుకుమార్ ఈసినిమాకు స్క్రీన్ ప్లే అందించారు.