మెగా మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యి.. తన సొంత టాలెంట్ గా హీరోగా ఎదుగుతున్నాడు. హీరో అవ్వడానికి మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా.. ఇండస్ట్రీలో ఎన్నో ఇబ్బందులు, అవమానాలు ఫేస్ చేశానంటున్నాడు సాయి తేజ్(Sai Dharam Tej) రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వూలో ఈ విషయాలు వెల్లడించాడు.

మెగా మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యి.. తన సొంత టాలెంట్ గా హీరోగా ఎదుగుతున్నాడు. హీరో అవ్వడానికి మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా.. ఇండస్ట్రీలో ఎన్నో ఇబ్బందులు, అవమానాలు ఫేస్ చేశానంటున్నాడు సాయి తేజ్(Sai Dharam Tej) రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వూలో ఈ విషయాలు వెల్లడించాడు.

మెగాస్టార్ చిరంజీవి(Mega Star Chiranjeevi) మేనల్లుడిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Power Star Pawan Kalyan) సపోర్ట్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు.. సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej). వారసత్వంగా ఇండస్ట్రీలోకి వచ్చినా.. కష్టపడి తన సొంత టాలెంట్(Won Talent) తో పరిశ్రమలో ఎదుగుతున్నాడు తేజ్. అంతే కాదు కొన్ని సందర్భాల్లోక తాను అనుభవించిన కష్టాలు, పడినమానసిక వేధన గురించి తాజాగా జరిగిన ఓ య్యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో వెల్లడించారు సాయి తేజ్. మరీ ముఖ్యంగా బైక్ యాక్సిడెంట్ కి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు. అలానే ఆ ప్రమాదం కార‌ణంగా తాను శారీర‌కంగా, మాన‌సికంగా ఎలాంటి ఇబ్బందుల‌ను ఎదుర్కొన్నాడో వివరించాడు.

ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ.. బైక్ యక్సిడెంట్ తరువాత నాకు కొన్ని ప్రాక్టికల్ గా తెలిసి వచ్చాయి. ముఖ్యంగా నాకు మాట విలువ ఏంటో తెలిసింది అన్నారు సాయి. ప్రమాదం జరిగినప్పుడు నేను షాక్ కి గురయ్యాను. దీంతో మాట కూడా పడిపోయింది. అయితే జనాలకి నాకు మాటపడిపోయిన విషయం తెలియదు. దీంతో వీడేంటి తాగేసి మాట్లాడుతున్నాడా? అంటూ జోకులేసుకున్నారు. కానీ మాట రావడం కోసం నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు అన్నారు సాయి తేజ్.

అంతే కాదు యాక్సిడెంట్ తరువాత నాకు మాటలు వస్తాయా..? రావా..? తెలియక.. మాటలు రాలేదని ఎంతో బాధ పడ్డాను.ఎందుకంటే.. నాకు మాట్లాడటం అంటే ఇష్టం.. మూమూలుగానే నేను చిన్నప్పటి నుంచీ బాగా మాట్లాడుతూనే ఉంటాను. ఎక్కువగా మాట్లాడేవాడిని అలాంటి నాకు ఒక్కసారిగా మాటలు రాకపోవడంతో.. కామ్ గా సైలెంట్ గా ఉండలేక.. మానసికంగా బాగా కుంగిపోయాను.. వేదనకు గురయ్యాను అంటూ బాధపడ్డారు సాయి ధరమ్ తేజ్.

మాట్లాడటం అనేది ఎంత సంతోషాన్ని ఇస్తాదో, ఎంతో ముఖ్యమో ఈ ప్రమాదం ద్వారా తెలుసుకున్నాను. అయితే నాకు మాటలు వస్తాయి కాని ప్రాక్టీస్ చేయాలి అన్నప్పుడ మాత్రం.. నేను మాట్లాడే వచ్చీరాని మాటలు... ప్రాక్టీస్ చేస్తున్న టైమ్ లో .. నా చుట్టు ఉన్నవారు నన్ను బాగా భరించారు.. ఓపిగ్గా నామాటలు అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించారు. నాతోటి యాక్టర్స్, నాకు చాలా సపోర్టుగా ఉన్నారు నాతో మాటలు ప్రాక్టీస్ చేయించడానికి ఎంతో కష్టపడ్డారు. కాని కొంత మంది మాత్రం అసలు విషయం తెలుసుకోకుండా.. నన్ను విమర్షించడం స్టార్ట్ చేశారు అని బాధపడ్డారు మెగా హీరో.

మరికొంత మంది మాత్రం నన్ను హేళన చేశారు.. 90 వేసి వచ్చాడా అంటూ కొందరు నాపై జోక్స్ వేశారు. అయితే ఆ మాటల విలువ వాళ్లకి తెలియదు. వాళ్లకి ఆ మాటలు కేవలం జోక్స్ లాగానే ఉంటాయి అంటూ సాయి ధరమ్ తేజ్ ఎమోషనల్ అయ్యారు. ఇక షూటింగ్స్ లో బిజీ బిజీ అయ్యారు సాయి తేజ్. తాజాగా ఆయన విరూపాక్ష సినిమా(Virupaksha Movie)తో పాన్ ఇండియా(Pan India)ను టచ్ చేయబోతున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 21న రిలీజ్ కాబోతోంది. కార్తీక్ దండు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈమూవీలో సంయుక్తా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.
.

Updated On 4 April 2023 12:02 AM GMT
Ehatv

Ehatv

Next Story