మెగా.. నందమూరి ఫ్యామిలీల మధ్య ఎప్పుడూ ప్రొఫిషినల్ వార్ జరుగుతుంటుంది. సినిమాల విషయంలో వీరి ఫ్యాన్స్ మధ్య యుద్ద వాతావరణం ఉంటుంది. కాని హీరోలంతా మేము స్నేహంగానే ఉంటాం..మీలో మీరు ఇలా గొడవపడకండీ.. అంటూ చెపుతూనే ఉంటారు. ఇక హీరోల మధ్య సహకారం కూడా అంతే ఉంటుంది మరి. మెగాహీరో కోసం..నందమూరి హీరో.. నందమూరి హీరో కోసం మెగా హీరోలు..సహాయం చేసుకునే సందర్భాలు కూడా లేకపోలేదు.

మెగా.. నందమూరి ఫ్యామిలీల మధ్య ఎప్పుడూ ప్రొఫిషినల్ వార్ జరుగుతుంటుంది. సినిమాల విషయంలో వీరి ఫ్యాన్స్ మధ్య యుద్ద వాతావరణం ఉంటుంది. కాని హీరోలంతా మేము స్నేహంగానే ఉంటాం..మీలో మీరు ఇలా గొడవపడకండీ.. అంటూ చెపుతూనే ఉంటారు. ఇక హీరోల మధ్య సహకారం కూడా అంతే ఉంటుంది మరి. మెగాహీరో కోసం..నందమూరి హీరో.. నందమూరి హీరో కోసం మెగా హీరోలు..సహాయం చేసుకునే సందర్భాలు కూడా లేకపోలేదు. ఇక రీసెంట్ గా అలాంటి సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej).

టాలీవుడ్(Tollywood) లో మెగా ఫ్యామిలీ(Mega Family), నందమూరి ఫ్యామిలీ(nandhamuri Family) మధ్య గట్టి పోటీ కనిపిస్తుంటుంది. అయితే అది కేవలం సినిమాలు వరుకే గాని వ్యక్తిగతంగా మెగా అండ్ నందమూరి హీరోలు చాలా స్నేహంగా ఉంటారు. దానికి బెస్ట్ ఎక్జాంపుల్.. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ స్నేహం. రీసెంట్ గా.. అల్లు అర్జున్ ను ఎన్టీఆర్ బావా అని పిలవడం..ఇలా చాలాసందర్భాలు చెప్పుకోవచ్చు. ఇలాంటిదే సాయి ధరమ్ తేజ్ కూడా ఒక సందర్భం గురించి వివరించారు. అదేంటంటే.. తనకు కెరీర్ గురించి గైడ్ చేసింది ఎన్టీఆర్(NTR) అని అన్నారు తేజ్.

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో ఎన్టీఆర్ స్నేహం ఇటీవల బయటపడింది. విరూపాక్షటైటిల్ గ్లింప్స్(Virupaksha Title Glimpse) కి ఎన్టీఆర్ తన వాయిస్ ఇచ్చి సాయి ధరమ్ తో తన స్నేహం రివీల్ చేశాడు. ఇక అందరూ ఈ విషయంలో ఆశ్చర్యపోయారు. కొంత మందికి అసలు విషయమే అర్ధం కాలేదు. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో సాయి ధరమ్ ఇంకో ఇంటరెస్టింగ్ విషయం షేర్ చేసుకున్నాడు.

తాజాగా తన సినిమాకు సబంధించి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మా కుటుంబం మెగా ఫ్యామిలీతరువాత నన్ను బాగా సపోర్ట్ చేసింది ఎన్టీఆర్. తను సినిమాలోకి రాకముందు నుంచే నాకు మిత్రుడు. ఇక నా కెరీర్ స్టార్టింగ్ సరైన హిట్టులు లేని సమయంలో.. ఒరేయ్ తేజ మంచి సినిమాలు చేయాలిరా అంటూ నన్ను గైడ్ చేశాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఈ విషయం అందరిని ఆశ్చర్య పరిచింది.

Updated On 14 April 2023 2:22 AM GMT
Ehatv

Ehatv

Next Story