జీవితంలో కొన్ని కొన్నిసందర్భాలు మనిషిని డిప్రెషన్ లోకి తీసుకెళ్తాయి. అటువంటి సందర్భం తన జీవితంలో ఫేస్ చేసిన సాయి తేజ్.. ఆ అనుభవాలను స్టేజ్ పై పంచుకున్నారు. సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) హీరోగా కార్తిక్ వర్మ డాండు(Karthik Varma Dandu) దర్శకత్వంలో రూపొందిన సినిమా విరూపాక్ష(Virupaksha Movie). ఈ సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది. కాస్త గ్యప్ తరువాత సాయి తేజ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో..మెగా ఫ్యాన్స్ లో ఇంట్రెస్ట్ పెరిగిపోయింది.

Sai Dharam Tej Emotional On His Bike Accident
జీవితంలో కొన్ని కొన్నిసందర్భాలు మనిషిని డిప్రెషన్ లోకి తీసుకెళ్తాయి. అటువంటి సందర్భం తన జీవితంలో ఫేస్ చేసిన సాయి తేజ్.. ఆ అనుభవాలను స్టేజ్ పై పంచుకున్నారు.
సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) హీరోగా కార్తిక్ వర్మ డాండు(Karthik Varma Dandu) దర్శకత్వంలో రూపొందిన సినిమా విరూపాక్ష(Virupaksha Movie). ఈ సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది. కాస్త గ్యప్ తరువాత సాయి తేజ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో..మెగా ఫ్యాన్స్ లో ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. ఇక ఈమూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్(Movie Pre Release Evet) ఏలూరు(Eleru)లో ఘనంగా జరిగింది. ఈవేదికపై సాయితేజ్ ఎమోషనల్ అయ్యారు. బావోద్వేగంతో మాట్లాడారు. సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ .. తన కెరీర్ లో ఎదుర్కొన్ని ఇబ్బందుల గురించి తలుచుకుని బాధపడ్డారు.
2009లో హీరోగా నా కెరియర్ మొదలైంది. అప్పటి నుంచి 2016 వరకూ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ అవసరం కూడా ఎప్పుడూ రాలేదు. మీ అందరి ప్రేమాభిమానాలతో మంచి హిట్లు కొట్టాను. 2016 నుంచి వరుసగా ఆరు ఫ్లాపులు వచ్చాయి.. దాంతో లైఫ్ ఎటు పోతుంది అని అనిపించింది. సరిగ్గా అప్పుడే నాలో పట్టుదల పెరిగింది.. ఆ ఫ్లాపుల తరువాత మరింత కష్టపడటం నేర్చుకున్నాను. 'చిత్రలహరి' తరువాత నా కెరియర్ కుదురపడిందని అనుకున్నాను. కానీ అంతలోనే యాక్సిడెట్ నా జీవితాన్ని మళ్లీ ఇబ్బందుల్లో నెట్టింది అన్నారు.
2021లో బైక్ జారి పడిపోయాను. ఆ తరువాత నేను కళ్లు తెరిచి చూసింది మా అమ్మగారినే, సారీ చెబుదామని అంటే నాకు మాట రాలేదు. నిలబడలేక పోయాను. ఏంటిరా ఈ జీవితం ఇలా అయ్యింది అనిపించింది. ఏడుపు ఆగలేదు.. బాధతట్టుకోలేకపోయాను. అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు సాయితేజ్.
ఇక మళ్ళీ నన్ను నేను ఓదార్చుకుని.. మళ్ళీ పట్టుదల పెంచుకున్నాను.. నేను మాట్లాడవలసిందే .. అని నిర్ణయం తీసుకున్నాను. ఆ టైమ్ లో నా అభిమానులు గుర్తుకు వచ్చారు. వాళ్లను సంతోషపెట్టవలసిందే అనే నిర్ణయానికి వచ్చాను. ఎవరు ఏమనుకున్నా ఫరవాలేదు .. తిరిగి నా అభిమానుల నుంచి ప్రేమను పొందాలనుకున్నాను. అందుకోసం ఎంత కష్టమైనా పడాలనుకున్నాను. పడుతున్నాను అన్నారు. అందుకే నాజీవితంలో వచ్చిన ప్రమాదం మీ జీవితంలో కూడా జరగొచ్చు.. అందుకే తప్పకుండా హెల్మెట్ వాడండి అని చెప్పారు సాయి ధరమ్ తేజ్.
