✕
శ్రీ వేంకటేశ్వర సినీ చిత్రం పతాకంపైన కార్తీక్ దండు దర్శకత్వంలో సుప్రీం హీరో సాయి ధర్మతేజ, సంయుక్త మీనన్ కాంబినేషన్లో భోగవల్లి బాపినీడు నిర్మించిన Mystic Horror Thriller విరూపాక్ష ఈ రోజు విడుదలైంది. సినిమాలో సీనియర్ నటులు సాయిచంద్, రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ, సునీల్ తదితరులు దాదాపుగా సినిమా మొత్తం మీద ప్రధానపాత్రలలో కనిపిస్తారు.

x
virupaksha
-
- శ్రీ వేంకటేశ్వర సినీ చిత్రం పతాకంపైన కార్తీక్ దండు దర్శకత్వంలో సుప్రీం హీరో సాయి ధర్మతేజ, సంయుక్త మీనన్ కాంబినేషన్లో భోగవల్లి బాపినీడు నిర్మించిన Mystic Horror Thriller విరూపాక్ష ఈ రోజు విడుదలైంది. సినిమాలో సీనియర్ నటులు సాయిచంద్, రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ, సునీల్ తదితరులు దాదాపుగా సినిమా మొత్తం మీద ప్రధానపాత్రలలో కనిపిస్తారు.ప్రతీ పాత్రకీ దర్శకుడు కార్తీక్ దండు అతి ముఖ్యమైన పాత్రీకరణను అందివ్వడం వల్ల కథాగమనం నిండుగా సాగడమే కాదు, ప్రతీ పాత్రీ బాగా ఎలివేట్ అయి సినిమా రక్తికట్టడానికి ఎంతో దోహదపడిందని చెప్పాలి. విరూపాక్ష పబ్లిసిటీ కేంపైన్ ప్రారంభమైనప్పట్నుంచీ కూడా సినిమా గురించి యూనిట్ మొత్తం ఎన్నో మాటలు చెప్పారు. ఎంతో వర్ణించారు. సాధ్యమైనంతవరకకూ మీడియా అడిగిన ప్రశ్నల మేరకు వైడ్‌గా ఎనలైజ్ చేసి మరీ చెప్పారు.
-
- అన్ని సినిమాలకు ఈ విధంగానే చెప్పడం అన్నది పరిపాటిగా మారిపోయింది కాబట్టి, ఇదంతా మామ్మూలేగా అనిపించిన సందర్భాలు లేకపోలేదు. కానీ విరూపాక్ష సినిమా చూసినతర్వాత దర్శకుడు, హీరో, హీరోయిన్, నిర్మాత, టెక్నీషియన్స్ అందరూ వేరువేరుగా చెప్పిన ప్రతీమాటకీ విరూపాక్ష ఆద్యంతం సాక్ష్యంగా నిలవడమే విరూపాక్ష సాధించిన ప్రత్యేకమైన విశేషం ఎంతో శ్రమ పడి, మద్యమధ్యలో సాయి దర్మతేజ ప్రమాదానికి గురైన కారణంగా గ్యాప్‌లు వచ్చినప్పటికీ కూడా, ఓపికగా, డెడికేట్ అయి టీమ్ మొత్తం ఫైనల్ ఎఫెక్ట్‌ని సాధించడానికి ఎంతగా తపించారో విరూపాక్ష చూస్తే ఆ ప్రయాస, ప్రయత్నం కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. ఈ మధ్య రోజులలో ఇటువంటి జోనర్‌తో సినిమాలు కరువైన నేపథ్యంలో విరూపాక్ష భలే ధ్రిల్లింగ్‌గా అనిపించింది.
-
- కథగా విరూపాక్ష:- కథగా విరూపాక్ష గురించి చెప్పాలంటే...రుద్రవరం అనే కుగ్రామం. అందులో మొదలైన మరణాలు. అంతుబట్టని విధంగా ఏ పాత్ర ఎలా మరణిస్తోంది, కారణాలు ఏమిటి అనే ఉత్కంఠతో ప్రారంభమైన స్క్నీన్ నెరేషన్లో హీరో సాయి ధర్మతేజ ఎంటర్ కావడం దగ్గర్నుంచీ ఓ స్పెషల్ ఎటెన్షన్ని సంతరించుకుంటుంది. రుద్రవరం ఊరి పురోహితుడు సూచించి, అమలు చేసిన ప్రతీ ఉపాయం బెడిసికొట్టడమే కాకుండా, కథలో పాత్రలకు వెన్నులో చలిపుట్టి, ఎవరెప్పుడు ఏ కారణానికి బలైపోతారో తెలియని రీతిలో కథ ముందుకు సాగుతున్నప్పుడు సహజంగానే ఆసక్తి రెట్టింపు అవుతూ వచ్చింది. ఆ ఆసక్తి ఎక్కడా వీక్ అవకుండా, సీన్ బై సీన్లో జరుగుతున్న పరిణామాలలో, హీరోయిన్ నందిని(సంయుక్తామీనన్)పాత్ర కూడా దాదాపుగా చావు అంచులకు చేరుకుంటున్న దశలో కథలోని మెయిన్ ప్లాట్ రివీల్ అవుతుంటే నిజంగానే హీరోయిన్ బతుకుతుందా, హీరో రక్షించగలడా అనే సందిగ్ధం ఆడిటోరియంని టెన్షన్‌తో పిండేసింది. అయితే చివరగా నందిని పాత్రే నిగూఢంగా రుద్రవరంలో మరణాలకు ప్రధాన కారణమని తెలిసిన తర్వాత ఆడిటోరియం గొప్ప కిక్‌ని ఎంజాయ్ చేసింది.
-
- హీరోయిన్ కుటుంబానికి రుద్రవరం గ్రామస్తులు చేసిన అపకారానికి ప్రతీకారం తీర్చుకునేందుకే హీరోయిన్ గ్రామం మద్యలోనే ఉండి, ఈ డ్రామాని నడిపించిందీ అని ఫ్లాష్ అయినప్పుడు....అదీ రియల్ షాక్ వేల్యూ! క్లైమాక్స్ అయిపోయిన తర్వాత ప్రేక్షకుడు మళ్ళీ మొదటి నుంచీ సినిమానంతా గుర్తు చేసుకోకతప్పదు. అదే విరూపాక్ష కథలో ఉన్న నేచురల్ మేజిక్! పెరఫారమెన్సెస్ ఇటువంటి కథలో హీరోకేమంత పెద్దగా చెయ్యడానికి ఉండదులే అనేది చాలామంది అభిప్రాయం. కానీ, హీరో గట్స్‌తో చివరివరకూ నిలబడి, స్ట్రాంగ్ లుక్స్‌తో, ప్రేక్షకులతో పాటూ తనుకూడా కథను నమ్మి, రిస్క్‌ని కేర్ చేయకుండా, సీరియస్ కమిట్మెంట్తో కథలో మిస్టరీని సాల్వ్ చేయడానికి చేసే ప్రయత్నంలోనూ హీరో పెరఫారమెన్స్ చాలా స్పష్టంగా కనపింస్తుంది.
-
- అదే ఇందులో సాయి ధర్మతేజ చూపించిన మెరిట్. ఎంత బ్యాలెన్స్‌తో ప్రతీ లుక్‌నీ, ప్రతీ ప్రేంలో, ప్రతీ మూమెంట్‌ని, ప్రతీ షాట్లో ఎంతో కేర్‌ఫుల్, సినిమాకి హెల్స్ అయ్యేవిధంగా ప్రజెంట్ చేశాడో...సుపర్బ్! కమ్బేక్ ఫిల్మ్‌లా అందరూ అనుకున్న విరూపాక్ష చిత్రంలో సాయిధర్మతేజ కథని మొత్తం భుజాన్న వేసుకుని ముందుకెళ్ళిన తీరుతెన్నులను మెచ్చుకోవాల్సిందే. రేపటి రోజున పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయబోతున్న ఓ గొప్ప మలుపుకి, సాయి ధర్శతేజ స్వయంగా కొట్టేసిన గిఫ్ట్ విరూపాక్ష.
-
- పకడ్బందీ కథలో పక్కా క్యారెక్టర్‌కి తనదైన ప్రత్యేకతను ప్రతీ సీన్లోను సాయి ప్రేక్షకులకు అందించాడు. తర్వాత చెప్పుకోవాల్సింది సంయుక్తా మీనన్ గురించే. అంతవరకూ సాదాసీదా హీరోయిన్లా కనిపించిన సంయుక్త ఒక్కసారిగా క్లైమాక్స్‌కి వచ్చేసరికి నందిని పాత్రలో ఎక్స్‌లెంట్‌గా పెరఫార్మ్ చేసింది. సినిమాకి ఓ రకంగా చెప్పాలంటే సంయుక్త, సాయి...ఇద్దరి మీదనే సాగిన క్లైమాక్స్‌లో ఇద్దరికిద్దరూ స్ట్రాంగ్‌గా నిలబడ్డారు. ఇంక ఇతర పాత్రలలో కనిపించిన సునీల్, బ్రహ్మాజీ, అజెయ్, సాయిచంద్, రాజీవ్ కనకాల అందరూ వాళ్ళకున్న సీనియారిటీ, మెచ్యూరిటీ, పాప్యులారిటీల కారణంగా, ఆ పాత్రల నిడివి తక్కువే అయినా సినిమాకి తిరుగులేని నిండుదనం ఆటోమేటిక్‌గా వచ్చింది.
-
- సుపర్బ్ ..డైరెక్టర్ కార్తీక్ దండు :- కథా రచయిత, ధర్మకుడు రెండు పాత్రలు పోషించిన కార్తీక్ దండు వర్క్ సుపర్బ్. చేతబడులు, బ్లాక్ మేజిక్‌లు బాగా పాతబడిపోయిన టాపిక్లే అయినా, ఆ కంటెంట్‌ని కొత్తగా ఆవిష్కరించడానికి కార్తీక్ చేపట్టిన ప్రక్రియ సాహసమనే చెప్పాలి. అయినా, ఆ సాహసాన్ని కూడా జనరంజకంగా, రాసుకున్నప్పుడే ఆసక్తికరంగా తీర్చిదిద్దుకుని, అప్పుడు సినిమాగా రూపొందించడానికి కార్తీక్ తీసుకున్న జాగ్రత్తలు డెఫినెట్‌గా సినిమాకి ప్రాణం పోశాయి. అరుంధతి లాటి చిత్రం వచ్చిన చాలా కాలానికి విరూపాక్ష వచ్చింది. కెజిఎఫ్లు, త్రిబుల్ ఆర్లు విజృంబించిన కాలంలో కూడా గ్రామీణమైన మూఢనమ్మకాలకు పటిష్టమైన కధారూపాన్నిచ్చి కార్తీక్ ప్రశంసనీయంగా రాణించాడు. అప్కోర్స్....గొప్ప దర్శకుడనిపించుకున్న సుకుమార్ స్క్రీన్‌ప్లే రాసినా, కార్తీక్ రాసిన కథలో దమ్ము లేకపోతే సుకుమార్ అసలు ఈ ప్రాజెక్ట్‌ని ఎంకరేజ్ చేసే ఉండేవాడు కాడు. అది మళ్ళీ కార్తీక్ క్రెడిటే. ఇంతకు ముందు ఓ సినిమా చేసినా విరూపాక్షే కార్తీక్ తొలి సినిమాలా అంత గ్లామర్ వచ్చింది కార్తీక్‌కి. కీపిటప్ కార్తీక్!
-
- టెక్నికల్ వేల్యూస్ :- సినిమా వెనుక పనిచేసే 24 క్రాఫ్ట్‌లు విజృంబించి చేసిన సినిమా విరూపాక్ష. మ్యూజిక్, ఆర్ట్, కెమెరా, మేకఫ్...ఒకటి కాదు ప్రతీ డిపార్ట్‌మెంటూ కూడా వాళ్ళవాళ్ళ ఉనికిని బాగా చాటి చెప్పుకున్న సినిమా ఇది. సౌండ్ డిజైనింగ్ అని కార్తీక్ పదేపదే చెప్పేవాడు. అదేంటో చూస్తే గానీ అర్ధం కాలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సుపీరియర్. వెరసి, అందరూ సినిమా మొత్తం కుమ్మేశారు. ఇది నా సినిమా కాదన్నట్టుగా అంతటి సుప్రసిద్ధ నిర్మాతైన బిబిఎస్ ఎన్ ప్రసాద్ ఇదంతా తన కొడుకు బాపినీడు ఎఛీవ్మెంట్ మాత్రమేనని ముందస్తుగానే చెప్పారు. ఏ వేదికపైనా తను కూర్చోకపోయినా, ఈ సినిమాకి సోల్‌గా నిలబడి, కార్తీక్ చెప్పిన కథకు ఇంత గొప్ప తెరరూపాన్ని అందించిన యవనిర్మాత బాపినీడు ఈ విజయానికి ప్రధానమైన ఎలిమెంట్. Written Byనాగేంద్రకుమార్

Ehatv
Next Story