బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman khan) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన ఎంతగానో ప్రేమించి .. అద్దు(Addu) అని పిలుచుకునే వ్యాక్తి మరణించడంతో.. సల్మాన్ తీవ్ర బావోద్వేగానికి లోనయ్యారు.

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman khan) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన ఎంతగానో ప్రేమించి .. అద్దు(Addu) అని పిలుచుకునే వ్యాక్తి మరణించడంతో.. సల్మాన్ తీవ్ర బావోద్వేగానికి లోనయ్యారు. ఎమోషనల్ పోస్ట్ కూడా పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఆమె ఎవరు.. సల్మాన్ కు ఏమౌతుంది అనేది మాత్రం క్లారిటీ లేదు. ఆమెను సల్మాన్ అద్దు అనిమాత్రం పిలుస్తారని తెలుస్తోంది.

అయితే ఈ విషయంలో ఫ్యాన్స్ మధ్య డిఫరెంట్ చర్చ నడుస్తోంది. ఆమె సల్మాన్ చిన్నప్పుడు కేర్ టేకర్(care taker) అన్ని. ఆయన్ను పెంచింది ఆమే అంటున్నారు. మరికొంత మంది మాత్రం ఆమె సల్మాన్ ఆంటీ అంటున్నారు. ఎవరు అనేది క్లారిటీ ఇవ్వలేదు కాని.. ఇన్ స్టా గ్రామ్ లో ఆమె ఫోటో పెట్టిన సల్మాన్ ఖాన్. రిప్ అద్దు అంటూ ట్యాగ్ లైన్ మాత్రం రాశారు. దీంతో అసలు ఈమె ఎవరా అని ఫ్యాన్స్ ఆరాలు తీయ్యడం స్టార్ట్ చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక సల్మాన్ సినిమాల విషయానికి వస్తే.. రీసెంట్ గా కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ మూవీతో థియేటర్లలోకి వచ్చాడు. కాని ఈసినిమా ఆడియన్స్ ను అలరించలేకపోయింది. తీవ్రంగా నిరాశపరిచింది. హిందీలో పర్వాలేదు అనిపించినా..ఇతర భాషల్లో మాత్రం పరాజయం చవిచూసింది. సౌత్ నుంచి వెంకటేష్, జగపతి బాబు లాంటి మల్టీ లాంగ్వేజ్ స్టార్స్ ఇందులో నటించినా.. ఏమాత్రం ఉపయోగపడలేదు. దాంతో సల్మాన్ కాస్త నిరాశలో ఉన్నారు. ఇంతలోనే తన ఇంట్లో ఇలా విషాదం చోటు చేసుకుంది.

పూజా హెగ్డే హీరోయిన్ గా నటించినకిసీ కా భాయ్ కిసీ కీ జాన్ మూవీలో సౌత్ స్టార్ హీరో వెంకటేష్ ప్రత్యేక పాత్ర చేశారు. జగపతి బాబు విలన్ గా నటించగా టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ సాంగ్ లో మెరిసారు. సల్మాన్ ఖాన్ ప్రాణ స్నేహితుడు ..బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కూడా గెస్ట్ రోల్ లో అలరించారు. ఈమూవీ రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే.. నెగెటీవ్ టాక్ తెచ్చుకుంది.

Updated On 4 May 2023 7:13 AM GMT
Ehatv

Ehatv

Next Story