ఈమధ్య కొన్ని కాంబినేషన్లు విచిత్రంగా కలుస్తాయి. అవి సిల్వర్ స్క్రీన్ పై సెన్సేషన్ క్రియేట్ చేస్తాయి. మరికొన్ని మాత్రం అంచనాలు పెంచి.. తుస్సు మనిపిస్తాయి. అయితే ఈ రెండింటికి టాలీవుడ్ లో ఎక్జాంపుల్స్ ఉన్నాయి. అయితే త్వరలో ఎవరూ ఊహించని కాంబినేషన్ లో సినిమా రాబోతోన్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) జోడీగా..

ఈమధ్య కొన్ని కాంబినేషన్లు విచిత్రంగా కలుస్తాయి. అవి సిల్వర్ స్క్రీన్ పై సెన్సేషన్ క్రియేట్ చేస్తాయి. మరికొన్ని మాత్రం అంచనాలు పెంచి.. తుస్సు మనిపిస్తాయి. అయితే ఈ రెండింటికి టాలీవుడ్ లో ఎక్జాంపుల్స్ ఉన్నాయి. అయితే త్వరలో ఎవరూ ఊహించని కాంబినేషన్ లో సినిమా రాబోతోన్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) జోడీగా.. క్రికెట్ గాడ్ సచిన్ కూతురు సారా అలీ ఖాన్ నటించబోతున్నట్టు సమాచారం.

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ముద్దుల తనయ సారా టెండూల్కర్(Sara Tendulkar) ఇటీవలి కాలంతో వార్తల్లో నిలుస్తోంది. యంగ్ స్టార్ క్రికెటర్ శుభ్ మన్ గిల్ తో ప్రేమ వార్తల వల్ల ఇంకా పాపులర్ అయ్యింది బ్యూటీ. శుభ్ మన్ ఏదైనా మ్యాచ్ ఆడితే.. అక్కడ సారా ఉందేమోఅని చూసుకుంటున్నారు ప్రేక్షకులు. ఈక్రమంలోనే అతనితో ఆమె ప్రేమలో ఉందని... త్వరలోనే వీరు పెళ్లిపీటలు ఎక్కబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే ఇప్పుడు సారాకు చెందిన మరో వార్త ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ సరసన సారా నటించబోతోందనే వార్త.. అటు బాలీవుడ్ ను.. ఇటు టాలీవుడ్ ను కుదిపేస్తోంది. ఇందులో నిజం ఎంత అనేది తెలియదు కాని.. ఈ న్యూస్ విని అంతా షాక్ అవుతున్నారు. రామ్ చరణ్ తో యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు సినిమాను తెరకెక్కించబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. మరోవైపు, ఈ సినిమాలో క్రేజీ కాంబినేషన్ ను సెట్ చేయాలని బుచ్చిబాబు భావిస్తున్నారట. చెర్రీ సరసన సారా టెండూల్కర్ ను నటింపజేసేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారట.
ఈసినిమాలో హీరోయిన్ గురించి చాలా రూమర్స్ వచ్చాయి. జాన్వీ కపూర్ అని కొందరు.. లేదు సాయి పల్లవి అని మరికొందరు...ఇలా రకరకాల హీరోయిన్ల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈక్రమంలో ప్రస్తుతం సారా టెండుల్కర్ పేరు బయటకు వచ్చింది. మరి బుచ్చిబాబు ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి.

Updated On 22 Nov 2023 5:05 AM GMT
Ehatv

Ehatv

Next Story