ఆర్ఎక్స్ 100'తో(RX 100) సెన్సేషన్ క్రియేట్ చేసిన యువ దర్శకుడు అజయ్ భూపతి(Ajay Bhupathi).. అజయ్ భూపతి-పాయల్ రాజ్‌పుత్(Payal Rajput) కాంబోలో వచ్చిన హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్(Thriller) ‘మంగళవారం’(Mangalavaram).. దర్శకుడి రెండో చిత్రం 'మహాసముద్రం'తో(Mahasamudram) తీవ్ర నిరాశకు గురి చేసినా దర్శకుడుగా అజయ్ మాత్రం ఫెయిల్ కాలేదు.. టేకింగ్ పరంగా మహాసముద్రం ఓకే. మహాసముద్రం తర్వాత మళ్లీ తన స్టయిల్లో కథానాయిక పాత్రను సంచలనాత్మకంగా ప్రెజెంట్ చేస్తూ..
ఆర్ఎక్స్ 100'తో(RX 100) సెన్సేషన్ క్రియేట్ చేసిన యువ దర్శకుడు అజయ్ భూపతి(Ajay Bhupathi).. అజయ్ భూపతి-పాయల్ రాజ్‌పుత్(Payal Rajput) కాంబోలో వచ్చిన హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్(Thriller) ‘మంగళవారం’(Mangalavaram).. దర్శకుడి రెండో చిత్రం 'మహాసముద్రం'తో(Mahasamudram) తీవ్ర నిరాశకు గురి చేసినా దర్శకుడుగా అజయ్ మాత్రం ఫెయిల్ కాలేదు.. టేకింగ్ పరంగా మహాసముద్రం ఓకే. మహాసముద్రం తర్వాత మళ్లీ తన స్టయిల్లో కథానాయిక పాత్రను సంచలనాత్మకంగా ప్రెజెంట్ చేస్తూ.. ఆఖరి అరగంటలో ట్విస్టులతో ఆశ్చర్యపరుస్తూ.. ఒక వైవిధ్యమైన థ్రిల్లర్ మూవీని మంగళవారం రూపంలో మనకి అందించాడు.. కొన్ని లోపాలున్నప్పటికీ.. ఒక వైవిధ్యమైన మిస్టరీ థ్రిల్లర్ చూడాలనుకునేవారికి ఇది మంచి ఛాయిస్.
సందేహం లేదు.. ఇంటర్వెల్ తర్వాత కథలో స్పీడ్ తగ్గినా ఒక్కసారిగా సస్పెన్స్(Suspence) పక్కకి వెళ్లి గ్లామర్ మరియు ఎమోషన్ మీదే తనదైన శైలిలో దృష్టి పెట్టాడు దర్శకుడు. కానీ, పాయల్ పాత్రను చూస్తే కొందరికి అయినా జాలికలుగుతుంది.ఎమోషనల్‌గా ఇన్వాల్వ్ అవుతారు. హీరోయిన్ పాత్ర ఫ్లాష్ బ్యాక్‌లో కొన్ని సీన్లు అంత కన్విన్సింగ్‌గా లేకపోయినా మిగతాదంతా కూడా బాగాతీశాడు డైరెక్టర్ అజయ్.. చివరి 40 నిమిషాల్లో దర్శకుడు ప్రేక్షకులకు పెట్టిన ట్విస్టులు భలేగా అనిపిస్తాయి.. కొన్నిచోట్ల లాజిక్ మిస్ అయినా ప్రేక్షకులు మాత్రం థ్రిల్ ఫీల్ అవుతారు. సెకండ్ హాఫ్‌లో ప్రతి క్యారెక్టర్‌కు కనెక్టివిటీ కుదరడంతో ప్రేక్షకులు బానే ఎంజాయ్ చేస్తారు. ఇక ఈ సినిమా హీరోయిన్ దర్శకుడు అజయ్ భూపతి లక్కీ హ్యాండ్ పాయల్ రాజపుత్ అప్పియరెన్సు, బోల్డ్ పెర్ఫార్మెన్స్ పరంగా బావుంది. మితీమిరిన శృంగార కోరికలు మాత్రం ఫ్యామిలీ అడియన్స్‌ను ఇబ్బంది పెడతాయేమో చూడాలి. ఎస్సై పాత్ర వేసిన నందిత శ్వేతకు డబ్బింగ్ సెట్ అవ్వకపోయినా పర్వాలేదు అనిపిస్తుంది. ప్రథమార్ధంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అజయ్ గోష్, గుడ్డివాడిగా చేసిన లక్ష్మణ్ పాత్రల గురించి.. వీరిద్దరూ కలిసి సాధ్యమైనంత మేర ప్రేక్షకులను నవ్వించారు. డాక్టర్ పాత్రలో రవీంద్ర విజయ్ కూడా ఆకట్టుకుంటాడు. ఇక సాంకేతిక నిపుణుల విషయానికొస్తే మంగళవారం'లో అడుగడుగునా టెక్నికల్ బ్రిలియన్స్ కనిపిస్తుంది. కాంతారా ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ ఈ తరహా థ్రిల్లర్లకు సంగీతాన్నందించడంలో ఆరితేరిపోయాడనే చెప్పాలి. తన బ్యాగ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. కథనంలో వేగాన్ని.. ఉత్కంఠను పెంచడంలో ఆర్ఆర్ కీలక పాత్ర పోషించింది. సినిమాటోగ్రాఫర్ శివేంద్ర దాశరథి గోదావరి జిల్లాల అందాలను, కథకు అవసరమైన విజువల్స్ అందించాడు. నైట్ ఎఫెక్ట్ లో సాగే సన్నివేశాలు.. యాక్షన్ ఎపిసోడ్లు హైలెట్‌గా చిత్రీకరించాడు. తైజుద్దీన్ సయ్యద్-కళ్యాణ్ రాఘవ్ మాటలు కథకు తగ్గట్లు కుదిరాయి..సినిమాలో సమాజంలో పోకడలను పరోక్షంగా ఎత్తిచూపాడు దర్శకుడు అజయ్ భూపతి.. చివరగా మంగళవారం అజయ్ భూపతికి మంచి కం బ్యాక్ మూవీ అనే చెప్పాలి..ఓ డిఫరెంట్ సినిమా చూడాలనుకునే ఈతరం ఏజ్ గ్రూప్ వాళ్లకి కూడా మంగళవారం నచ్చుతుంది..