✕
Payal Rajput : బంతులను ఎగరేస్తున్న ఆర్ఎక్స్ 100 భామ.. 'యూ ఆర్ గార్జియస్' అంటున్న అభిమానులు.. !
By EhatvPublished on 28 May 2023 11:36 PM GMT
పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput).. ఈమె బోల్డ్ బ్యూటీగా అందరికీ తెలుసు. 2018లో వచ్చిన ఆర్ఎక్స్ 100 (RX 100) చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయింది ఈ భామ. ఆ సినిమాలో ‘పిల్లారా’ సాంగ్ తో తెలుగు యూత్ ఆడియన్స్‌లో ఓ ప్రత్యేక స్థానం కల్పించుకుంది పాయల్ రాజ్‌పుత్.

x
Payal Rajput
-
- పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput).. ఈమె బోల్డ్ బ్యూటీగా అందరికీ తెలుసు. 2018లో వచ్చిన ఆర్ఎక్స్ 100 (RX 100) చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయింది ఈ భామ. ఆ సినిమాలో ‘పిల్లారా’ సాంగ్ తో తెలుగు యూత్ ఆడియన్స్‌లో ఓ ప్రత్యేక స్థానం కల్పించుకుంది పాయల్ రాజ్‌పుత్.
-
- అయితే ఈ భామ ఆర్ఎక్స్ 100 కంటే ముందు అంటే 2017లో పంజాబీ చిత్రంతో చిత్ర పరిశ్రమకు పరిచయం అయింది. చన్నా మేరియా (Channa Mereya) చిత్రంతో బెస్ట్ డెబ్యూట్ యాక్టర్‌గా ఫిలిమ్ ఫేర్ అవార్డు అందుకుంది ఈ హాట్ భామ.
-
- ఆ తర్వాత 2018లో వీరేకి వెడ్డింగ్ (Veerey Ki Wedding) చిత్రంతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు పరిచయం అయింది పాయల్. అదే సంవత్సరంలో అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఎక్స్100 చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ఈ భామ.
-
- 2010లో పాయల్ హిందీ టీవీ సీరియల్స్ ద్వారా తన నటనా కెరీర్‌ను ప్రారంబించింది. సప్నోన్ సే భారే నైనా (Sapnon Se Bhare Naina) సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ తర్వాత నాలుగు సీరియళ్ల తర్వాత తెలుగు సినిమా చేసింది ఈ ముద్దుగుమ్మ.
-
- 1992 డిసెంబర్ 5న ఢిల్లీలో జన్మించింది. తల్లిదండ్రులు విమల్ కుమార్ రాజ్‌పుత్, నిర్మల్ రాజ్‌పుత్. ఈ బ్యూటీ పుట్టింది ఢిల్లీలో అయినా నివసించేది మాత్రం ముంబై. ఆమెకు చిన్నప్పటి నుంచి నటనపై ఇంట్రెస్ట్ ఉండటంతో ఆమె గ్రాడ్యుయేషన్ తర్వాత సినీ పరిశ్రమలోకి ప్రవేశించింది.
-
- ఈ భామ తెలుగుతోపాటు తమిళం, పంజాబీ, హిందీ, కన్నడ సినిమాలు చేస్తోంది. ఇటు సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ అభిమానులు తన వెంట తిప్పుకుంటుంది ఈ బ్యూటీ.
-
- తాజాగా ఈ అమ్మడు ఎల్లో కలర్ స్పోర్ట్స్ డ్రెస్సులో రెడ్ కలర్ బాల్, హెల్మెట్, బ్యాట్‌తో దర్శనమిచ్చింది. ఈ ఫొటోలకు ‘క్యాచ్ ఆప్ ది మూమెంట్’ అంటూ ఓ క్యాప్షన్ కూడా ఇచ్చింది ఈ భామ. లేటెస్ట్ గా అప్ లోడ్ చేసిన ఫొటోలకు కమెంట్స్ చేసేందుకు కామెంట్స్ సెక్షన్ బాక్సులోకి దూసుకొచ్చారు ఆమె ఫ్యాన్స్.
-
- ఈ ఫొటోలకు ఫైర్, రెడ్ హార్ట్ ఎమోజీలను కామెంట్ సెక్షన్ బాక్సులో వదులుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ అభిమానాన్ని చూపిస్తున్నారు. ఓ అఫిషియల్ యూజర్ అయితే ‘గార్జియస్.. ఇన్క్రెడిబుల్ గార్జియస్’ అంటూ రెడ్ హార్ట్ ఎమోజీలతో కమెంట్ చేశారు.
-
- ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో రెండు సినిమాలు, తెలుగులో ఒక సినిమా చేస్తోంది. వీటిలో గోల్మాల్ (తమిళం) సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. తమిళంలో ఏంజెల్, తెలుగులో కిరాతక చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇక ఈ భామకు ఇన్స్టాగ్రామ్(Instagram)లో 4.1 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

Ehatv
Next Story