అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) ఇప్పుడు మెగా కోడలు కాబోతున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ అందాల భామ తెలుగింటి కోడలుగా మారబోతున్నారు. వరుణ్‌తేజ్‌తో కలిసి ఇంకొన్ని రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. మెగా ఇంటికి కోడలుగా వెళుతున్నారు కాబట్టి ఇప్పట్నుంచే కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంతకు ముందంటే ఫర్వాలేదు కానీ, ఇప్పుడు సినిమా పాత్రల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) ఇప్పుడు మెగా కోడలు కాబోతున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ అందాల భామ తెలుగింటి కోడలుగా మారబోతున్నారు. వరుణ్‌తేజ్‌తో కలిసి ఇంకొన్ని రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. మెగా ఇంటికి కోడలుగా వెళుతున్నారు కాబట్టి ఇప్పట్నుంచే కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంతకు ముందంటే ఫర్వాలేదు కానీ, ఇప్పుడు సినిమా పాత్రల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది పడితే అది ఒప్పుకోకూడదు. ఇప్పుడామె ఏం చేసినా మెగా కుటుంబంతో పాటు మెగా ఫాన్స్‌ను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. అందుకే ఆమె ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. వరుణ్ తేజ్‌తో ఎంగేజ్‌మెంట్ కాగానే అంతకు ముందు ఆమె ఒప్పుకున్న కొన్ని సినిమాలను కూడా వదిలేసుకున్నారు. ప్రస్తుతం ఆమెకు వస్తున్న అవకాశాలను కూడా పక్కన పెట్టేస్తున్నారు. తమిళంలో ఒక వెబ్ సిరీస్ చేసేందుకు కొన్ని నెలల కిందట లావణ్య త్రిపాఠి ఓకే చెప్పారు. స్కైలాబ్(Skylab) సినిమాకు దర్శకత్వం వహించిన విశ్వక్ ఖండేరావ్ ఈ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించనున్నారు. కొద్దిరోజుల్లో షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయి. ఇలాంటి సమయంలో లావణ్య త్రిపాఠి వెబ్ సిరీస్ చేయనని చెప్పారు. ఈ వెబ్ సిరీస్‌లో కథ రీత్యా హీరోయిన్ పాత్ర కాసింత బోల్డ్‌గా(Bold Character) ఉంటుందట! కొన్ని రోమాన్స్ సన్నివేశాలు కూడా ఉన్నాయట! అందుకే లావణ్య త్రిపాఠి వెబ్ సిరీస్‌కు నో చెప్పారు. కొద్దిరోజుల్లో మెగా ఇంటికి కోడలిగా అడుగుపెడుతున్న సమయంలో ఇలాంటి సినిమాలో నటించడం కరెక్ట్ కాదని భావించిన లావణ్య , ఆ వెబ్‌సిరీస్ దర్శక, నిర్మాతలను పిలిపించి మరొక హీరోయిన్‌ని చూసుకోమని చెప్పేశారట! ఆమె తీసుకున్న అడ్వాన్స్‌ను కూడా వెనక్కి ఇచ్చేశారట! నిశ్చితార్థం అయిన తర్వాత ఇక నేను కొణిదలవారి కోడల్ని. ఇలాంటి కథల్లో నటించడం సబబుకాదని వారికి చెప్పి పంపించేశారట. ఈ విషయం తెలిసిన మెగా ఫ్యాన్స్ లావణ్య నిర్ణయాన్ని సోషల్ మీడియా ద్వారా అభినందిస్తున్నారు.