కోలీవుడ్‌ నటుడు శింబు(Shimbu) తెలుగువారికి కూడా కాస్తో కూస్తో పరిచయం.

కోలీవుడ్‌ నటుడు శింబు(Shimbu) తెలుగువారికి కూడా కాస్తో కూస్తో పరిచయం. అతడి సినిమాలు తెలుగులో కూడా డబ్‌ అయ్యాయి. నట దర్శకుడు టి.రాజేందర్‌ వారసుడిగా చిన్నప్పుడే సినిమాల్లో అడుగుపెట్టిన శింబు బాలనటుడిగా మంచి మార్కులే సంపాదించాడు. తర్వాత హీరో అయ్యాడు. తండ్రిలాగే శింబు కూడా బహుముఖ ప్రతిభావంతుడు. పాటలు పాడతాడు. రాస్తాడు. సంగీత దర్శకత్వం కూడా వహిస్తాడు. సినిమాలను డైరెక్ట్ కూడా చేస్తాడు. ప్రస్తుతం కమలహాసన్‌(Kamal haasan) హీరోగా వస్తున్న థగ్‌లైఫ్‌(Thug life) సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. కమలహాసన్‌ సొంత సినిమాలోనూ శింబు నటిస్తున్నాడు. రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శింబు ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇది అతడికి 48వ సినిమా. తర్వాత మరో సినిమాను కూడా శింబు ఒప్పుకున్నాడు. పర్సనల్ లైఫ్‌కు వస్తే 41 ఏళ్ల శింబు ఇంకా బ్రహ్మచారిగానే ఉన్నాడు. నయనతారతో(Nayanthara) ప్రేమలో పడిన శింబు తర్వాత ఎందుకో బ్రేకప్‌ చెప్పాడు. నటి హన్సికనూ ప్రేమించాడు. ఈ బంధం పెళ్లి వరకు వెళ్లి ఆగిపోయింది. ఇప్పుడు నటి నిధి అగర్వాల్‌తో(Nidhi aggarwal) డేటింగ్‌లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. 2021లో శింబు హీరోగా నటించిన ఈశ్వరన్‌ సినిమాలో నిధి అగర్వాలే హీరోయిన్‌గా నటించింది. అప్పట్నుంచి వీరు డేటింగ్‌లో ఉన్నారట! కొంతకాలం వీరిద్దరికి సంబంధించిన వార్తలేమీ రాలేదు కానీ మళ్లీ సోషల్‌ మీడియాలో వీరి ప్రేమ వ్యవహారం వైరల్‌ అవుతోంది. వీరి డేటింగ్‌ పెళ్లి వరకూ వెళ్లనుందని, ఇందుకు ఇరు కుటుంబ సభ్యులు అంగీకరించారని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే పెళ్లి జరుగుతుందట! తన కొడుకుది ఇప్పటికైనా ప్రేమ వివాహమే అవుతుందని టి.రాజేందర్‌ అప్పుడెప్పుడో చెప్పారు. అది నిజమవుతుందన్నమాట!

Updated On 29 Sep 2024 11:05 AM GMT
Eha Tv

Eha Tv

Next Story