ఎన్టీఆర్‌(NTR), రామ్‌చరణ్‌(RAMCHARAN) హీరోలుగా దర్శకుడు రాజమౌళి(Rajamouli) రూపొందించిన ఆర్‌ఆర్‌ఆర్‌(RRR) సినిమా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాలోని పాటకు ఆస్కార్‌ అవార్డు కూడా వచ్చింది. పలు భాషల్లో ట్రిపులార్‌ విజయాన్ని సాధించింది.

ఎన్టీఆర్‌(NTR), రామ్‌చరణ్‌(RAMCHARAN) హీరోలుగా దర్శకుడు రాజమౌళి(Rajamouli) రూపొందించిన ఆర్‌ఆర్‌ఆర్‌(RRR) సినిమా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాలోని పాటకు ఆస్కార్‌ అవార్డు కూడా వచ్చింది. పలు భాషల్లో ట్రిపులార్‌ విజయాన్ని సాధించింది. గత ఏడాది మార్చి 25న విడుదలైన ఈ సినిమా విదేశాల్లోనూ సత్తా ప్రదర్శించింది. ఆర్‌ఆర్‌ఆర్‌ తెలుగు వెర్షన్‌ను జపనీస్‌(Japanese) సబ్‌ టైటిల్స్‌తో 2022 అక్టోబర్‌ 21న జపాన్‌లో విడుదల చేశారు. అక్కడ కూడా ఈ సినిమా బ్రహ్మండమైన విజయాన్ని అందుకుంది. జపాన్‌ బాక్సాఫీస్‌ దగ్గర 130 కోట్ల రూపాయల గ్రాస్‌ కలెక్షన్స్‌ సాధించింది. అక్కడ సినిమా ఇంకా ఆడుతోంది. దీంతో ఈ సినిమాను సబ్‌ టైటిల్స్‌తో కాకుండా నేరుగా జపాన్‌ భాషలోనే రిలీజ్‌ చేయాలనుకుంది చిత్ర యూనిట్‌. అనుకున్నదే తడవుగా జపాన్‌ భాష్‌లో సినిమాను డబ్‌ చేశారు. జపాన్‌ సబ్‌టైటిల్స్‌తో కూడిన తెలుగు వెర్షన్‌ ట్రిపులార్‌ సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శితమవుతోంది. ఇప్పుడు జూలై 28న ఈ సిని మాను జపాన్‌ భాషలో రిలీజ్‌ చేసేందుకు రెడీ అవుతున్నామని చిత్ర యూనిట్‌ వెల్లడించింది.

Updated On 17 Jun 2023 1:18 AM GMT
Ehatv

Ehatv

Next Story