✕
#Oscars2023 : RRRకి ఆస్కార్ వచ్చే అవకాశాలు.. ఎలాగో తెలుసా.?
By EhatvPublished on 11 March 2023 6:55 AM GMT
‘ఆస్కార్’ అవార్డ్స్ అనగానే ప్రతీ ఒక్కరిలో ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఎదురు చూస్తారు కూడా. అయితే 2023 ‘ఆస్కార్’ అవార్డ్స్ కార్యక్రమం ఈ నెల 13న జరగనుంది. ఇప్పటికే ఇండియన్ ఫిల్మ్ లవర్స్ కూడా ‘ఆస్కార్’ అవార్డ్స్ పై ఫుల్ ఫోకస్ పెట్టారు.

x
Oscars2023
-
- ‘ఆస్కార్’ అవార్డ్స్ అనగానే ప్రతీ ఒక్కరిలో ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఎదురు చూస్తారు కూడా. అయితే 2023 ‘ఆస్కార్’ అవార్డ్స్ కార్యక్రమం ఈ నెల 13న జరగనుంది. ఇప్పటికే ఇండియన్ ఫిల్మ్ లవర్స్ కూడా ‘ఆస్కార్’ అవార్డ్స్ పై ఫుల్ ఫోకస్ పెట్టారు.
-
- వాటిలో భాగంగానే ఇప్పుడు ఎన్టీఆర్, రామ్ చరణ్ అమెరికాలో ఉన్నారు. ఆ ప్రమోషన్స్ వీళ్లు బిజీబిజీ గా ఉన్నారు. ‘నాటు నాటు’ సాంగ్ ‘ఆస్కార్’ అవార్డ్స్ కి నామినేట్ అయినప్పటి నుంచి తెలుగు ప్రజల్లో ఆశలు పెరగడంతోపాటు దేశ ప్రజలకు టాలీవుడ్ వైపు చూస్తున్నారు.
-
- ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ చేస్తున్న ప్రమోషన్స్ చూస్తుంటే జక్కన్న తెరకెక్కించిన మూవీకి ఆస్కార్ కచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తోంది. ఎల్లుండి జరిగే ఈ అవార్డ్స్ కోసం ఇప్పటికే అంతా రెడీ చేశారు అకాడెమి టీమ్. దీని కోసం ప్రెజెంటర్స్ అంతా కూడా సిద్దంగా ఉన్నారు
-
- మరో వైపు ‘నాటు నాటు’ సాంగ్ కి స్టేజిపై సాంగ్ పెర్ఫార్మెన్స్ ఉంటుందా అన్న ప్రశ్నకు ఎన్టీఆర్ రియాక్ట్ అయ్యారు. ఈ ఈవెంట్లో పెర్ఫామ్ చేయాలని ఉండిందని.. ప్రాక్టీస్ చేయడానికి టైమ్ లేకపోవడంతో చేయలేకపోతున్నట్టు చెప్పుకొచ్చారు.
-
- ఇదిలా ఉంటే మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ పెర్ఫామెన్స్ ఉంటుందని చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్. ప్రేక్షకులలో కూర్చుని సాంగ్ చూడటం తనకు బాగుంటుందని భావిస్తున్నానని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.

Ehatv
Next Story