వరుస హీట్లు.. వరుస సినిమాలు.. స్టార్ ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు రామ్ చరణ్( Ram Charan). టాలీవుడ్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ ఇమేజ్ ఇప్పుడు గ్లోబర్ స్టార్ గా మారిపోయింది. మెగా తనయుడు ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్ గా ఎదిగాడు. మరి ఇంతలా ఎదిగిన చరణ్ బాబు ఆస్తులు ఎంత ఉండి ఉంటాయి అని డౌట్ వస్తుంది కదా..? ఖచ్చితంగా చెప్పలేము కాని ఓ అంచనా ప్రకారం చరణ్ ఆస్తులు విలువ చూస్తే...?
వరుస హీట్లు.. వరుస సినిమాలు.. స్టార్ ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు రామ్ చరణ్( Ram Charan). టాలీవుడ్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ ఇమేజ్ ఇప్పుడు గ్లోబర్ స్టార్ గా మారిపోయింది. మెగా తనయుడు ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్ గా ఎదిగాడు. మరి ఇంతలా ఎదిగిన చరణ్ బాబు ఆస్తులు ఎంత ఉండి ఉంటాయి అని డౌట్ వస్తుంది కదా..? ఖచ్చితంగా చెప్పలేము కాని ఓ అంచనా ప్రకారం చరణ్ ఆస్తులు విలువ చూస్తే...?
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) వారసుడిగా టాలీవుడ్ లో అడుగుపెట్టి.. ఎన్నో విమర్షలను కూడా ఎదుర్కొని.. మెగా తనయుడిగా.. తన టాలెంట్ నిరూపించుకనిన.. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా మారాడు రామ్ చరణ్( Ram Charan). ఆర్ఆర్ఆర్ RRR మూవీతో రామ్ చరణ్ తారా స్థాయికి చేరుకున్నాడు. అయితే చరణ్ విలాసవంతమైన జీవనశైలి, అతని స్థిరాస్థి విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.
ఇప్పటికే రామ్ చరణ్( Ram Charan) ఒక్కో సినిమాకు భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. ఆస్కార్ సాధించిన ఆర్ఆర్ఆర్ కోసం చరణ్ .40 కోట్లకు పైగా ఛార్జీ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు తన అప్ కమింగ్ ఫిల్మ్ ఆర్సీ 15 (RC 15), ఆర్సీ 16కు కూడా 50 కోట్లకు పైనే వసూలు చేస్తున్నాడట. ఈరెండు సినిమాలకు 100 కోట్లు తీసుకుంటున్న చరణ్.. త్వరలో 100 కోట్ల జాబితాలోకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది.
చరణ్ హీరోగా సినిమాలపై వచ్చే ఇన్ కం మీదనే ఆధారపడటంలేదు.. ఆయన బిజినెస్ మెన్ గా కూడా తననుతాను నిరూపించుకున్నాడు. రామ్ చరణ్ కు 1,300 కోట్ల విలువ చేసే ఎయిర్‌లైన్ కంపెనీ తోపాటు ఓ పోలో క్లబ్ కూడా ఉన్నట్టు సమాచారం. ట్రూజెట్ అనే ప్రైవేట్ ఎయిర్‌లైన్ కంపెనీలో ఆయన బాగస్వామిగా ఉన్నాట. ఇక చరణ్ కు కోట్లు విలువచేసు సొంత జెట్ కూడా ఉంది. ఫ్యామిలీ టూర్స్ కు.. భార్య ఉపాసన(Upasana)తో కలిసి ఎప్పుడైనా బయటకువెళ్లడానికి దాన్ని ఉపయోగిస్తాడట చరణ్.
రామ్ చరణ్ కు పోలో టీమ్ కూడా ఉంది. హైదరాబాద్ పోలో క్లబ్ కు చరణ్ యజమాని. రామ్ చరణ్ హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్ పేరుతో రామ్ చరణ్ తనకంటూ ఓ పోలో టీమ్ కొనాలని నిర్ణయించుకున్నాడు. ఈ పోలో టీమ్ కోసం దాదాపు 20 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి పోలో క్లబ్ లో భాగస్వామిగా ఉన్నట్టు గా తెలుస్తోంది. మగధీర సక్సెస్ తర్వాత చరణ్ ఈ టీమ్ ను కొనుగోలు చేసినట్టు సమాచాం.
ఇక రామ్ చరణ్ కు కాస్త కార్ల పిచ్చి కూడా ఉంది. ఆయన గ్యారేజ్ లో కోట్లు విలువ చేసే కార్లు పడి ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఆస్టన్ మార్టిన్ V8 వాంటేజ్ నుండి రోల్స్ రాయిస్ ఫాంటమ్, రేంజ్ రోవర్, BMW M7, Mercedez Benz g62 AMG లాంటి కార్లను తన గ్యారేజ్ లో లాక్ చేశాడు చరణ్. వీటి విలువ పదికోట్లకు పైనే ఉంటుంది అంటున్నారు. ఇక స్టైల్ మెయింటేన్ చేయడంలో చెర్రీ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎంత హ్యాండ్సమ్ గా రెడీ అవుతాడో అందరికి తెలిసిందే. ముఖ్యంగా డ్రెస్, వాచీలు, షూస్ అంటే చరణ్ కు మక్కువ ఎక్కువ. ఇక తనకు నచ్చిన ప్రతి గడియారాన్ని కొనడానికి ఇష్టపడతాడు. ఇప్పటి వరకు చరణ్ కు 30 అత్యంత ఖరీదైన గడియారాలు ఉన్నట్టు తెలుస్తోంది. అందులో కోటి, రెండు కోట్ల విలువ చేసే వాచ్ లు కూడా ఉన్నాయట.
ఆమధ్య 80 లక్షల వాచ్, 50 వేలు విలువ చేసే చెప్పులు.. మూడు లక్షలు విలువ చేసే షూస్.. ఇలా కాస్ట్లీ ఐటమ్స్ తో కనిపించాడు చరన్. ఇక చరణ్ మెయింటేనెస్ ను ఆయన అభిమానులు ఎప్పటికప్పుడు ట్రెండింగ్ చేస్తూనే ఉంటారు. ఇక చరణ్ మెగాస్టార్ తో కలిసి ఉంటున్నాడు. ఆయన ఇల్లు 50 కోట్ల పై మాటే అంటున్నారు. ఇది కాకుండా చరణ్ కు హైదరాబాద్ లో మరో సోంత ఇళ్ళు ఉంది.. ముంబయ్ లో పెంట్ హౌస్ ప్లాట్ ను కోట్లు పెట్టి కోన్నాడట చరణ్. ఈ రకంగా చూసుకుంటే.. చరణ్ ఆస్తి.. వందలు.. వేల కోట్లు ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనకవసరం లేదు. ఇక రామ్ చరణ్ సతీమణి ఉపాసన కూడా అపోలో సంస్థలో భాగస్వామి కావడంతో.. ఆమెకు కూడా వందల కెట్ల ఆస్తి ఉన్నట్టు తెలుస్తోంది.