ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన రామ్ చరణ్ ప్రస్తుతం ఆస్కార్ విజయం సంబరాల్లో ఉన్నారు. 2022 మార్చిలో విడుదలైన ఈ చిత్రం బాక్సీఫీస్ దగ్గర రికార్డులు తిరగరాయడంతోపాటు.. సీన్స్ అండ్ సాంగ్స్, భాషతో ఇలా సంబంధం లేకుండా అందరిని అలరించింది. 95వ ఆస్కార్ అవార్డ్స్‏లో బెస్ట్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ సాంగ్‏కు ఆస్కార్ దక్కింది. లాస్ ఏంజెల్స్ లో జరిగిన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి దర్శకుడు రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హాజరయ్యారు.

అయితే ఇటీవల అవార్డుల ప్రదానోత్సవం తర్వాత ఫస్ట్‏టైమ్ మీడియాతో మాట్లాడిన ఆయన.. హాలీవుడ్ ఎంట్రీ గురించి ప్రస్తావించారు. హాలీవుడ్ సినిమాల్లోకి ఎంట్రీ గురించి అడిగిన ప్రశ్నకు దానికి సంబంధించిన వివరాలు చెప్పడానికి ఆయన నిరాకరించారు. హాలీవుడ్ ప్రయత్నాలు ఉన్నట్టుగానే సంకేతాలు ఇస్తూ పూర్తి వివరాలు చెప్పడానికి వెనకడుగు వేశారు. హాలీవుడ్ ఎంట్రీ అనేది ఒక ప్రక్రియతో కూడుకున్న పని అని అలా జరగనివ్వడం అంటూ.. మరోవైపు ‘‘దిష్టి తగులుతుందంటూ’’ మా అమ్మ చెప్పిందని ఆయన చెప్పుకొచ్చారు.

ఇక ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఆర్సీ15’ చిత్రం చివరి దశలో ఉంది. 2024 జనవరిలో ఈ మూవీ థియేటర్లలోకి రాబోతున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‏గా నటిస్తోంది. ఇటీవలే కర్నూలులో ఓ కీలక షెడ్యూల్ ను పూర్తి చేశారు. ఇక సల్మాన్ ఖాన్ చేస్తున్న మూవీ ‘కిసీకా భాయ్ కిసీకి జాన్’లో ఓ స్పెషల్ క్యారెక్టర్ కూడా చేస్తున్నాడట మన చెర్రీ.

Updated On 18 March 2023 5:03 AM GMT
Ehatv

Ehatv

Next Story