టాలీవుడ్‏లో ఆధ్యాత్మిక సేవలో తరించే స్టార్ హీరోలు చాలా మంది ఉన్నారు. అందులో మెగా హీరోలు ఎక్కువగా దేవుని సేవలో తరిస్తుంటారు. సినిమా హీరోల్లో మెగా ఫ్యామిలీలో ఎక్కువగా ఆధ్యాత్మిక సేవలో తరిస్తుంటారు. వారికి కలిసిరావడంతోపాటు.. ఫ్యామిలీలో ప్రశాంతత కోసం కూడా చిరు, చరణ్ ప్రతీ ఏడాది దాదాపుగా మిస్ అవ్వకుండా అయ్యప్ప మాల వేసుకుంటుంటారు.

టాలీవుడ్‏లో ఆధ్యాత్మిక సేవలో తరించే స్టార్ హీరోలు చాలా మంది ఉన్నారు. అందులో మెగా హీరోలు ఎక్కువగా దేవుని సేవలో తరిస్తుంటారు. సినిమా హీరోల్లో మెగా ఫ్యామిలీలో ఎక్కువగా ఆధ్యాత్మిక సేవలో తరిస్తుంటారు. వారికి కలిసిరావడంతోపాటు.. ఫ్యామిలీలో ప్రశాంతత కోసం కూడా చిరు (Chiranjeevi), చరణ్ ప్రతీ ఏడాది దాదాపుగా మిస్ అవ్వకుండా అయ్యప్ప మాల వేసుకుంటుంటారు. తన తోటి హీరోలకు.. ఇబ్బందుల్లో ఉన్నవారందరికి సలహాలు కూడా ఇస్తుంటారు. అంతే కాదు నిత్యం దైవ చింతనలోనే ఉంటూ.. విదేశాలకు వెళ్ళినా కూడా.. దైవ ఆరాధన మరువకుండా విదేశీలకు కూడా మన ఆధ్యాత్మికాన్ని పరిచయం చేస్తుంటాడు.

ఆమధ్య ఆర్ఆర్ఆర్ (RRR) ఆస్కార్ ప్రమోషన్స్‏కి.. అమెరికా వెళ్లినప్పుడు కూడా చరణ్.. అక్కడి వారికీ అయ్యప్ప మాల గురించి డిస్కర్షన్ చేశారు. వాటి విశేషాలు కూడా వారికి వివరించారు. దీక్ష అనేది కేవలం ఆధ్యాత్మికం మాత్రమే కథను చెబుతూ దాని వెనుక ఉన్న సైంటిఫిక్ ఉపయోగాలు కూడా విదేశీలకు తెలియజేశాడు. చరణ్‏కు అయ్యప్ప స్వామి.. ఆధ్యాత్మిక చింతనపై బాగా నమ్మకం ఆనమ్మకంతోనే మన హీరోలకు కూడా సలహాలు ఇస్తుంటారు.

ఈక్రమంలోనే రీసెంట్ అక్కినేని అఖిల్ (Akhil Akkineni) కూడా రామ్ చరణ్ (Ram Charan) అయ్యప్ప మాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఏజెంట్ సినిమా ప్రమోషన్స్‏లో ఉన్న అఖిల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రొఫిషనల్‏గా నేను ఏంటి? నేను ఏమి సాదించడానికి ట్రై చేస్తున్నాను? ఏమి సాధిస్తున్నాను? అనే ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ అయోమయంలో పడిపోయిన సమయంలో రామ్ చరణ్ అయ్యప్ప మాల వేయమని నాకు చెప్పాడు అంటూ వివరిచాడు.

అసలే వరుసప్లాప్‏లతో ఇబ్బంది పడుతున్నాడు అఖిల్ (Akhil). ఎంత ప్రయత్నించినా.. లాభం లేకుండా పోయింది. దాంతో అఖిల్‏కు నమ్మకం ఉన్నా లేకపోయినా.. ఒక్క సారిగా మనస్పూర్తిగా నమ్ము.. అయ్యప్ప మాల వేసుకోమని రామ్ చరణ్ చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈక్రమంలో ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Updated On 29 April 2023 2:13 AM GMT
Ehatv

Ehatv

Next Story