ఆస్కార్ సాధించి సగర్వంగా ఇండియాలో అడుగు పెట్టారు ఆర్ఆర్ఆర్ టీమ్. ఇండియా వారికి ఘనంగా స్వాగతం పలికింది. ప్రతీ ఒక్కరు ఆర్ఆర్ఆర్ ఘనతను కీర్తించారు. మరి ఆర్ఆర్ఆర్ టీమ్ లో అందిరికి సత్యారం జరిగింది.. నిర్మాత దానయ్య ఎందుకు ఈ వేడుకలకు దూరంగా ఉన్నారు...?
ఆస్కార్(Oscar) సాధించి సగర్వంగా ఇండియాలో అడుగు పెట్టారు ఆర్ఆర్ఆర్(RRR) టీమ్. ఇండియా వారికి ఘనంగా స్వాగతం పలికింది. ప్రతీ ఒక్కరు ఆర్ఆర్ఆర్(RRR) ఘనతను కీర్తించారు. మరి ఆర్ఆర్ఆర్ టీమ్ లో అందిరికి సత్యారం జరిగింది.. నిర్మాత దానయ్య ఎందుకు ఈ వేడుకలకు దూరంగా ఉన్నారు...?
ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ మ్యానియా గట్టిగా నడిచింది. నాటు నాటు సాంగ్(natu Natu Song) కు హాలీవుడ్(Hollywood) కూడా కాలు కదిపించి ఆస్కార్(Oscar) తో పాటు గోల్డెన్ గ్లోబ్(Golden Glob).. క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్(Critics' Choice Movie Awards) తో పాటు.. ఎన్నో అంతర్జాతీయ అవార్డ్స్ ను అందుకుంది ఆర్ఆర్ఆర్. దాదాపు రెండు నెలలకు పైగా రాజమౌళి(Rajamouli) అమెరికా(America)లో ఉండి.. సినిమాను ప్రమోట్ చేస్తే.. మన హీరోలు కూడా చాలా కాలం అక్కడే ఉండి సందడి చేశారు. రాజమౌళి(Rajamouli), కీరవాణి(Keeravani),చంద్రబోస్(Chandrabose), ఎన్టీఆర్(Jr NTR), రామ్ చరణ్(Ram Charan), కాలభైరవ(Kalabhairava ), రాహుల్(Rahul), కార్తికేయా.. సెంథిల్.. ఇలా సినిమా టీమ్ చాలా వరకూ ఆస్కార్ వేదికపై సందడి చేశారు. కాని అసలు ముఖ్యమైన నిర్మాత దానయ్య(Danyya0 మాత్రం ఎక్కడ కనిపించలేదు.
ఇక ఆస్కార్ అవార్డు (Oscar Award)ప్రధానం సందర్బంగా నాటు నాటు పాటతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరు న్యూయార్క్‌లో సందడి చేశారు. కానీ నిర్మాత డీవీవీ దానయ్య మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఆస్కార్ వేదికనే కాక గోల్డెన్ గ్లోబ్ అవార్డు, హెచ్‌సీఏ అవార్డులు అందుకునే సందర్భంలో కూడా దానయ్య లేడు.దాంతో ఈ విషయంలో అనేక పుకార్లు జోరందుకున్నాయి. మరీ ముఖ్యంగా ఈ వివాదంలోకి చిరంజీవిని లాగుతూ వచ్చిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. దాంతో ఒకసారి దానయ్య ఈ విషయంలో స్పందించారు. తాను రాజమౌళితో మాట్లాడాలని చూశానని.. కాని సాధ్యం కాలేదన్నారు. ఇక ఈ విషయంలో మరో సారి స్పందించారు దానయ్య.
ఇక ఈవార్తలపై తాజాగా మరోసారి స్పందించారు దానయ్య. ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూన.. ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు. అంతే కాదు కాస్త ఘాటుగా వార్నింగ్ కూడా ఇచ్చాడు. స్టార్ ప్రొడ్యూసర్. నేను ఆస్కార్స్ ఫంక్షన్‌కి వెళ్లకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. దాని గురించి ఇంత రాద్దాంతం ఎందుకు చేస్తున్నారో అర్దం కావడంలేదు. ఇక ఈవివాదంలోకి చిరంజీవి(Chiranjeevi)గారిన ఎందుకు లాగుతున్నారో కూడా అర్ధం కావడంలేదు. అసలు ఇలాంటి వార్తలు ఎలా పుట్టిస్తారు.. వాళ్లకి కాస్త అయినా బుర్ర ఉందా.. కామన్ సెన్స్ లేని వాళ్లే.. ఇలాంటి పనులు చేస్తారు. అసలు ఈ ఆరోపణలు, పుకార్లు సృష్టించిన వారు నా ఆఫీస్‌కు వచ్చి.. అకౌంట్స్ చెక్ చేశారా.. అంటూమండిపడ్డారు. అంతే కాదు వాటిని నేను పట్టించుకోను.. ఇలాంటి చేయోద్దంటూ విన్నవించుకుంటన్నాను అన్నారు దానయ్య..