భూగోళంలో ఏ దేశంలో ప్రచార, ప్రసార మాధ్యమాలను చూసినా కూడా అన్నీ కూడా త్రిబుల్ ఆర్ ఆస్కార్ అవార్డుల వార్తా విహారంతో నిండిపోయి ఉన్నాయి. హాలీవుడ్ చిత్రాలు మినహా, గత యాభై ఏళ్ళలో త్రిబుల్ ఆర్ చిత్రం ప్రపంచదేశాలను ఊపేసినట్టుగా మరే భాషాచిత్రం ఎప్పుడూ ఊపలేదు. ప్రతీ దేశంలో మీడియా హౌస్‌లు త్రిబుల్ ఆర్ వివరాలను ప్రచురించడంలో గొప్ప ఉత్సుకతను, ఉత్సాహాన్నీ పదేపదే కనబరిచాయి. ఇంతటి వరల్డ్ ఫినామినా ప్రారంభమైంది మన కళ్ళముందు, మన హైదరాబాద్‌లో.
భూగోళంలో ఏ దేశంలో ప్రచార, ప్రసార మాధ్యమాలను చూసినా కూడా అన్నీ కూడా త్రిబుల్ ఆర్ ఆస్కార్ అవార్డుల వార్తా విహారంతో నిండిపోయి ఉన్నాయి. హాలీవుడ్ చిత్రాలు మినహా, గత యాభై ఏళ్ళలో త్రిబుల్ ఆర్ చిత్రం ప్రపంచదేశాలను ఊపేసినట్టుగా మరే భాషాచిత్రం ఎప్పుడూ ఊపలేదు. ప్రతీ దేశంలో మీడియా హౌస్‌లు త్రిబుల్ ఆర్ వివరాలను ప్రచురించడంలో గొప్ప ఉత్సుకతను, ఉత్సాహాన్నీ పదేపదే కనబరిచాయి. ఇంతటి వరల్డ్ ఫినామినా ప్రారంభమైంది మన కళ్ళముందు, మన హైదరాబాద్‌లో.
మన తెలుగుసినిమా కార్మికులు, శ్రామికుల చెమటబిందువుల సాక్షిగా, తెలుగువారి మేధస్సు, తెలుగువారి సృజనాత్మక శక్తి, శైలి ఆధారంగా తయారైన త్రిబుల్ ఆర్ చిత్రం అసలు పేరు రౌద్రం, రణం, రుధిరం( Rise, Roar, Revolt). కానీ వ్యావహారికంలో మాత్రం త్రిబుల్ ఆర్‌గా పాప్యులర్ అయిపోయింది. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ వంటి చారిత్రక పాత్రల కాంబోలో విఉయేంద్రప్రసాద్ రాసిన ఒక ఫాంటసీ కథ ఆధారంగా తయారైన ఈ కథకి హీరోలుగా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఎంపిక చేసుకున్న దర్శకుడు రాఉమౌళి సదరు ఇద్దరు హీరోలను ఇంటికి పిలిచి మరీ తన ఐదియాను పంచుకున్నారు. ఈ ఇద్ధరు హీరోలు ఇంతకు ముందే రాజమౌళి దర్శకత్వంలో నటించి, ఇద్దరికిద్దరూ బాక్సాఫీసు హిట్స్ సాధించుకున్నారు. ఒకటి మగథీర, మరొకటి యమదొంగ. అవి సాధించిన విజయాలు ఆ ఇద్దరు హీరోలకు కూడా మరపురాని హిట్స్‌గా వాళ్ళ వాళ్ళ కెరీర్‌లో నిలిచిపోయాయి. ఆ ఋణభావం ఇద్దరినీ ఆదికి ముందే కట్టిపడేసిన తరుణంలో రాజమౌళి ఇచ్చిన ఆఫర్‌ని ఆశతో, ఆలోచనతో ఓకే చేశారు ఇద్దరూ. అంతకంతా ఘోరమైన కసరత్తు చేసి, రాజమౌళి ఫైనల్‌గా షూటింగ్ కార్యక్రమాలను ప్రారంభించారు. 2017లో బాహుబలి 2-ది కన్‌క్లూజన్ తర్వాత తన తదుపరి చిత్రం డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పైన చేస్తానని, అందులో తారక్, చెర్రీ హీరోలుగా నటిస్తారని ముందస్తుగానే ఓ స్థాయిలో వార్తను లీక్ చేశారు.
2019లో రాజమౌళి మాట్లాడుతూ త్రిబుల్ ఆర్ చిత్రం బేసిక్‌గా 2004లో వచ్చిన ది మోటర్‌సైకిల్ డైరీస్ అనే చిత్రం ఆధారంగా చేస్తున్నట్టు వెల్లడించడం జరిగింది. అందులోని ప్రధానమైన సన్నివేశాలు తనని చాలా బాగా ఆకర్షించాయని కూడా జక్కన్న చెప్పాడు. 2018, నవంబర్ 19న చిత్రీకరణ కార్యక్రమాలను ప్రారంభించారు దర్శకుడు. తొలి షెడ్యూల్ హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న అల్యుమినియం ఫ్యాక్టరీలో ప్రారంభమైంది. ఇందులో ఇద్దరి హీరోలమీద యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించాడు దర్శకుడు జక్కన్న. ఇందులో ప్రధాన పాత్రను పోషించిన ఆలియాభట్ మాత్రం డిసెంబర్ 6 నుంచి చిత్రీకణలో పాల్గొంది. తర్వాత 20వ శతాబ్దపు తొలినాళ్ళలోని ఢిల్లీ రూపురేఖలను అనుసరిస్తూ రామోజీఫిల్మ్ సిటీలో భారీ సెట్ వేశారు. అందులో ప్రధానమైన సన్నివేశాలను చిత్రీకరించింది త్రిబుల్ ఆర్ యూనిట్. మహాబలేశ్వర్‌లో షూటింగ్ ముగించుకున్న తరువాత మళ్ళీ హైదనాబాద్‌లోనే షూటింగ్ ప్రారంభమైంది.
నిజానికి త్రిబుల్ ఆర్ 2021 అక్టోబర్ 13న విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా దెబ్బకి ప్రపంచవ్యాప్తంగా ఢియేటర్లనీ మూతబడి సినిమా పరిశ్రమే కుప్పకూలి, కుదేలైపోలయిన కారణంగా త్రిబుల్ ఆర్ విడుదల కూడా వాయిదా పడిపోయింది. అనేక చర్చల అనంతరం 25 మార్చి, 2022న విడుదలై ప్రపంచవ్యాప్తంగా దుమ్ము దులిపేసింది. ఆస్కార్ అవార్డ వార్త వెలువడిననాటి నుంచి కూడా త్రిబుల్ ఆర్ హవా ప్రతీ దేశాన్నీ వణికించింది. చిట్టవివరికి ఆస్కార్ అవార్డ్ అందుకున్న నాటునాటు పాటను ప్రతీదేశంవారు నేర్చుకునా పాడుకున్నారు. ఈ పాట ముఖ్య విశేషాలను జాతీయ మీడియా కూడా ప్రసారం చేసి పాటకు పట్టం కట్టింది.